Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామోజీకి భారతరత్న-సంస్మరణ సభలో చంద్రబాబు సహా వక్తల డిమాండ్..!

ఈ నెలలో మృతి చెందిన దివంగత మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఇవాళ విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, సినీ రంగ ప్రముఖులు, మీడియా రంగ ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు రామోజీ సేవల్ని గుర్తుచేసుకున్నారు.

రామోజీ స్ఫూర్తిని గుర్తుపెట్టుకుని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణాజిల్లాలోని పెదపారుపూడి వంటి చిన్న గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. ఏ స్థాయికి ఎదిగారో చూస్తే అదే పెద్ద ఉదాహరణ అన్నారు. ఓ ఎన్టీఆర్ లాగే ఓ రామోజీరావు మాత్రమే ఉంటారన్నారు. అలాంటి వారు మళ్లీ పుట్టరన్నారు. రామోజీరావు ఓ వ్యక్తి కాదని వ్యవస్థ అని, అలాంటి వ్యవస్థను నిర్మాణం చేశారన్నారు. ఏ రంగం ఎంచుకున్నా అందులో నంబర్ వన్ గా ఉండటం, ఆ రంగాన్ని మెగా స్కేల్ లో ఆలోచించారన్నారు.

ap cm Chandrababu to put efforts for bharat ratna to late ramoji rao key announcements

ఏ కార్యక్రమాన్ని చేసినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పోరాటం చేసిన యోధుడు రామోజీరావు అని చంద్రబాబు ప్రశంసించారు. సినీ, మీడియా, వ్యాపార రంగాల్లో ఆయన రాణించారన్నారు. మీడియాలో ఆయన చేసిన కృషికి యుధ్ వీర్, వీడీ గోయెంకా వంటి అవార్డులు వరించాయన్నారు. కేంద్రం కూడా పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించిందన్నారు. 40 ఏళ్లుగా ఆయన్ను తాను దగ్గరగా చూశానని, ఆయనకు భయం అనేది లేదని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తెలుగుజాతికి రామోజీరావు చేసిన సేవలకు గుర్తుగా భారతరత్న సాధించడం మనందరి బాధ్యతన్నారు.

ap cm Chandrababu to put efforts for bharat ratna to late ramoji rao key announcements

ఢిల్లీ విజ్ఞాన్ భవన్ తరహాలో సదస్సులు, పరిశోధనల కోసం అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే అమరావతిలో ఓ రోడ్డుకు రామోజీరావు మార్గం అని పేరు పెడతామన్నారు. ఆయన జీవితం ప్రారంభించిన విశాఖలో చిత్ర నగరి పేరుతో సినిమా షూటింగ్స్ కోసం ఏర్పాటు చేస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+