• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అదిరే హగ్గులు, మెరుపులాంటి ముద్దులు..! పాదయాత్రలో ఇచ్చినవన్నీ వెనక్కి తీసుకుంటున్న ఏపి సీయం జగన్..!!

|

అమరావతి/హైదరాబాద్: ఈమద్య పీఠాది పతులు కూడా వినూత్న పోకడలు అవలంబిస్తున్నారు. సాధారంణంగా పాదాబివందనం తర్వాత ఆశీర్వదించి తమ శిశ్యులకు నాలుగు ఆశీర్వచనాలు ఇవ్వడం సర్వ సాధారణం. అంతే కాకుండా నిత్యం ధ్యానంలో ఉండే పీఠాదిపతులు ఎవరిని కూడా అంత తొందరగా ముట్టకోవడనికి ఇష్టపడరు. షేక్ హాండ్ ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తారు పీఠాది పతులు. వారి ఆచార వ్యవహారాలు కూడా పరమ నిష్టగా ఉండడంతో వారు నివసించే ఆశ్రమాలను మలినం కానవ్వకుండా చూసుకుంటారు.

 నిన్నటిదాకా హగ్గులు..! ఇప్పుడు ముద్దులు కూడా..!!

నిన్నటిదాకా హగ్గులు..! ఇప్పుడు ముద్దులు కూడా..!!

ఐతే ఈ మద్య పీఠాది పతుల వ్యవహారంలో మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఇతర విదేశీయులు తమకు ఆశీర్వాదం కోసమో, ముహూర్తాల కోసమో తమ దగ్గరకు వచ్చినప్పుడు ఏకంగా ఆలింగనం చేసుకుంటున్నారు. మడి, ఆచార వ్యవహరాలు, కట్టుబాట్లు, ముట్టు, పవిత్రం అని చెప్పే పీఠాదిపతులు కూడా తమకు ప్రియమైన శిశ్యులు తమ ఆశ్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం అవన్ని మర్చిపోయి ఆలింగనాలకు సైతం సాహసిస్తున్నారు. ఇక మొన్న ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వద్దకు వెళ్లినప్పుడు ఆయన ఏకంగా చుంబనాలకు దిగి అందరిని ఆశ్యర్యానికి గురి చేసారు.

 ప్రధాని దగ్గర నుండి అందరూ హగ్గులే..! వెల్లువెత్తుతున్న ప్రశంసలు..!!

ప్రధాని దగ్గర నుండి అందరూ హగ్గులే..! వెల్లువెత్తుతున్న ప్రశంసలు..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా ఎన్నికల్లో మంచి మెజారిటీతో విక్టరీ సాధించిన తరువాత ఆయనకు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గెలిచిన వారికి ఇలా అభినందనలు కొత్తేమీ కాదు గానీ... జగన్ విషయానికి వచ్చేసరికి ఈ అభినందనలు కాస్తంత ఎక్కువగానే కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్రల పేరిట తాను నిర్వహించిన కార్యక్రమాల్లో జనాలకు హగ్గులు ఇస్తూ... ఆప్యాయంగా ముద్దులు పెడుతూ సాగిన జగన్ కు... ఇప్పుడు ఇవే హగ్గులు, కిస్సులు అభినందన రూపంలో వెల్లువెత్తుతున్నాయి.

 పాదయాత్రలో ఎంతో ఆప్యాయత..! నాయకుల అభినందనల రూపంలో అవన్ని వెనక్కి..!!

పాదయాత్రలో ఎంతో ఆప్యాయత..! నాయకుల అభినందనల రూపంలో అవన్ని వెనక్కి..!!

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్ కు వెళ్లిన జగన్ కు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అదిరిపోయే హగ్గిచ్చారు. బంపర్ విక్టరీ సాధించారంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చంద్రశేఖర్ రావు కుమారుడు కేటీఆర్ కూడా జగన్ కు అదిరేటి హగ్గిచ్చేశారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్ కు అక్కడ కూడా మంచి హగ్గే దక్కింది. రాజ్ భవన్ కు వెళ్లిన జగన్ ను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన జగన్ కు అక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అదిరేటి హగ్గు లభించేసింది.

 పీఠాదిపతి మెరుపు లాంటి ముద్దు..! ఉక్కిరిబిక్కిరైన జగన్..!!

పీఠాదిపతి మెరుపు లాంటి ముద్దు..! ఉక్కిరిబిక్కిరైన జగన్..!!

ఇక తాజాగా తనకు ఇష్టమైన గురువు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వద్ద జగన్ కు ఆలింగనంతో పాటు ఓ బ్రహ్మాండమై ముద్దు కూడా లభించింది. సీఎంగా గెలిచిన తర్వాత తొలిసారి తన ఆశ్రమానికి వచ్చిన జగన్ కు ఘన స్వాగతం పలికిన స్వరూపానంద... ఆశ్రమంలోకి వెళ్లాక జగన్ ను ఆలింగనం చేసుకోడంతో పాటు ముద్దు కూడా పెట్టుకున్నారు. మొత్తంగా హగ్గులతో మొదలైన అభినందనలు ముద్దుల దాకా వెళ్లిపోయాయన్న మాట.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM Chandrasekhar Rao was hugged of Jagan who went to Hyderabad after the results of the election results. Bumper Victory has been acknowledged as a spiritual achievement. Ktr, the son of Chandrasekhar Rao, is also jagged about it. After that, Jagan went to the joint governor of Telugu states and got good huggage there. Governor ESL Narasimhan embraced Jagan who went to Raj Bhavan. Jagan, who then went to Delhi, was also hacked from Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more