షాకింగ్: ఏపీ సీఎంవోలో ప్రవీణ్ ప్రకాష్‌ అధికారాలకు కోత -జీఏడీ కొత్త చీఫ్‌గా ముత్యాల రాజు

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లూ సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)లో ప్రిన్సిపల్ కార్యదర్శి(పొలిటికల్) హోదాలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అధికారాల్లో కోత పడింది. ప్రభుత్వ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యర్థులు చేసిన విమర్శలన్నిటిలో ప్రవీణ్ ప్రకాష్ పేరు వినపడటం సాధారణంగా మారిన నేపథ్యంలో ఈ మార్పును సర్వత్రా అనూహ్యంగానే భావిస్తున్నారు. వివరాలివి..

ప్రవీణ్ ప్రకాశ్ రిలీవ్..

ప్రవీణ్ ప్రకాశ్ రిలీవ్..

ఏపీ సర్కారులో చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తారని, సీఎం జగన్ మనసెరిగి త్వరితగతిన అనుకూల నిర్ణయాలు తీసుకుంటారని ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ కు పేరుంది. జీడీఏలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఇన్నాళ్లూ సీఎంవోకు నడిపించిన ఆయనను బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు జగన్ సర్కారు మంగళవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు,

కొత్త జీడీఏగా ముత్యాల రాజు

కొత్త జీడీఏగా ముత్యాల రాజు

1994 బ్యాచ్ ఐఏఎస్ అయిన ప్రవీణ్ ప్రకాష్ ఇకపై సీఎంకు ముఖ్యకార్యదర్శిగా మాత్రమే ఉంటారు. ఆయన విధుల్లో కోత పెడుతూ, ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో జీఏడీ ప్రిన్సిపల్ కార్యదర్శి(పొలిటికల్) పోస్టులో కొత్తగా జూనియర్ ఐఏఎస్ రేవు ముత్యాలరాజును నియమించారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముత్యాల రాజు ఇప్పటికే సీఎంకు అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ద్వారా ముత్యాల రాజుకు పూర్తి బాధ్యతలు దక్కినట్లయింది.

జగన్ ఫేవరెట్.. కేంద్ర సర్వీసులకు?

జగన్ ఫేవరెట్.. కేంద్ర సర్వీసులకు?

అధికార వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ప్రవీణ్ ప్రకాష్ పేరు మారుమోగడం ఏపీలో సర్వసాధారణమే. నిజానికి చంద్రబాబు పాలనలో అక్రమాలను దర్యాప్తు చేయాలనుకున్న జగన్ సర్కారు మొదట్లో ప్రవీణ్ ప్రకాష్ ను విచారణ కూడా చేయించారు. అప్పట్లో ఢిల్లీలోని ఆంధ్రాభవన్ కు రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ను జగన్.. ఏపీకి తీసుకొచ్చి సీఎంవో బాధ్యతలు కట్టబెట్టారు. అనతికాలంలోనే జగన్ ఫేవరెట్ ఐఏఎస్ గా ఆయన పేరు పొందారు. కాగా, రాజకీయాలతో ముడిపడిన, ప్రభుత్వ పరమైన నిర్ణయాలకు సంబంధించి కోర్టుల్లో, బయటా వివాదాలు రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రవీణ్ బాధ్యతల్లో కోత విధించారని, నిజానికి కొంతకాలంగా ఆయన విధులకు కూడా రాకుండా, ఢిల్లీకే పరిమితం అయ్యారని, కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+