వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు ముందుకు జగన్ లేఖ వ్యవహారం... విచారణ నుంచి ఉపసంహరించుకున్న జస్టిస్ యూయూ లలిత్

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ, ఏపీ హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ సీఎం జగన్‌ ఛీఫ్ జస్టిస్‌ బాబ్డేకు రాసిన లేఖ కలకలం రేపుతూనే ఉంది. లేఖ రాయడం ఓ ఎత్తయితే దాన్ని బహిర్గతం చేయడం మరో ఎత్తుగా మారింది. దీంతో జగన్‌ను ఈ రెండు వ్యవహారాల్లో దోషిగా నిర్దారిస్తూ పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

Recommended Video

    Supreme Court to hear separate pleas on November 16 against AP CM Jagan | Oneindia Telugu
    AP CM Jagan vs Justice NV Ramana:PIL to be heard in top court here is the Case hearing live updates

    సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు జగన్‌ రాసిన లేఖను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ ఆయన్ను పదవి నుంచి తొలగించాలని జీఎస్‌ మణి, ఏఎన్నార్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం ఇవాళ విచారణకు రాబోతోంది. సుప్రీంకోర్టులోని మూడు నంబర్‌ కోర్టులో జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించబోతోంది. సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మినిట్‌-టూ-మినిట్ మీకోసం

    Newest First Oldest First
    11:57 AM, 16 Nov

    ఏపీ సీఎం జగన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వాయిదా
    11:47 AM, 16 Nov

    నేను జడ్జీగా లేని బెంచ్‌ను విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాను: జస్టిస్ యూయూ లలిత్
    11:46 AM, 16 Nov

    తాను లాయర్‌గా ఉన్న సమయంలో ఒక పార్టీ తరపున వాదనలు వినిపించినందున ఈ కేసలో ఒక జడ్జిగా విచారణ చేపట్టలేనని పేర్కొన్న జస్టిస్ యూయూ లలిత్
    11:31 AM, 16 Nov

    ఏపీ సీఎం తొలగింపు కోసం దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ యూయూ లలిత్
    11:09 AM, 16 Nov

    సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి కమ్‌ కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్‌ తన లేఖలో ఆరోపణ
    10:43 AM, 16 Nov

    జగన్‌ను దోషిగా నిర్దారిస్తూ పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు
    10:42 AM, 16 Nov

    మరికాసేపట్లో సుప్రీంకోర్టు ముందుకు ఏపీ సీఎం జగన్ చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ వ్యవహారం

    English summary
    supreme court to hear petitions filed against chief minister of andhra pradesh ys jagan over his complaint on justice nv ramana to chief justice of india today.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X