వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టర్లపై జగన్ ప్రశంసలు- కోవిడ్‌పై పోరులో అద్భుత సేవలు- తగ్గుతున్న కేసులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కోవిడ్‌ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై సీఎం జగన్ ఇవాళ ప్రశంసల జల్లు కురిపించారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానం.. ఒక తల్లి మాదిరి సేవలు చేస్తున్న మీకు ధన్యవాదాలు అని జగన్ అన్నారు. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా ప్రాణాంతకం అని తెలిసినా రోగులకు డాక్టర్లు, వైద్యసిబ్బంది సేవలు అందిస్తున్నారని జగన్‌ ప్రశంసించారు. వారికి ఎలాంటి సహాయ, సహకారం కావాలన్నా అందించేందుకు సిద్దమని ప్రకటించారు. డాక్టర్లు, వైద్య సిబ్బందితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
మన రాష్ట్రానికి మహా నగరాలు లేవు, అంత పెద్ద మౌలిక సదుపాయాల్లేవు కానీ.. గట్టి కృషి ద్వారా కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారు. వైద్యులు, నర్సులు, వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ సిబ్బందితో పాటు.. ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఇది సానుకూల పరిస్థితి అని జగన్‌ అన్నారు.

ap cm ys jagan appraisal to doctors and medical staff for controlling covid 19 affect

చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు కరోనాపై మరింతగా దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కరోనా సోకినవారిలో 70 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నామని,. 50 శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలన్నారు.. ఆరోగ్యమిత్రలు, సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేయాలని వైద్యులు, వైద్య సిబ్బందికి సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

English summary
andhrapradesh chief minister ys jagan praises doctors and medical staff in the state for their service in fight against covid 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X