Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ: మోడీ నుండి రాష్ట్ర మంత్రుల దాకా..గుడ్ గవర్నెన్స్ అంటున్న ఫ్యాన్స్

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువగా మారాయి . సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులు , ఎంపీలు , వివిధ రాష్ట్రాల సీఎం లు సీఎం జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Recommended Video

    #HBDYSJagan సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌ధాని స‌హా ప‌లువురి కృత‌జ్ఞ‌త‌లు
    జగన్ కు విషెస్ చెప్పిన ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

    జగన్ కు విషెస్ చెప్పిన ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

    ప్రధాని నరేంద్ర మోడీ వైయస్ జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ వైయస్ జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

    జగన్ కు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ , రమేష్ పోఖ్రియాల్ శుభాకాంక్షలు

    జగన్ కు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ , రమేష్ పోఖ్రియాల్ శుభాకాంక్షలు

    కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రసాదించాలని ఆయన తన జన్మదిన శుభాకాంక్షలు పేర్కొన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ఈ సంవత్సరమంతా జగన్ కు కలిసిరావాలని ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు . కర్ణాటక సీఎం యడ్యూరప్ప సీఎం జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తన ట్విట్టర్ లో ప్రజలకు సేవ చేసేందుకు దైవానుగ్రహం సదా ఆయనకు ఉండాలని , ఆయురారోగ్యాలతో ఆయన ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు.

    చిన్నారిని దత్తత తీసుకుని మంచి మనిషి పుట్టిన రోజున అంటూ .. రోజా చేసిన మంచి పని

    చిన్నారిని దత్తత తీసుకుని మంచి మనిషి పుట్టిన రోజున అంటూ .. రోజా చేసిన మంచి పని

    వైసీపీ ఎంపీల నుండి ఎమ్మెల్యేల నుండి, మంత్రుల నుండి వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువగా మారాయి . నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. జగన్ అన్నకు పుట్టినరోజు బహుమతి ఇదే అంటూ రోజా కుమారి అనే చిన్నారిని దత్తత తీసుకున్నారు. మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని అంటూ ఈ విషయం గురించి రోజా ట్విట్టర్లో పేర్కొన్నారు.

    జగన్ కు విజయసాయి విషెస్, యంగ్, డైనమిక్ సీఎం అంటూ ఎంపీ పరిమల్ నత్వానీ ట్వీట్

    జగన్ కు విజయసాయి విషెస్, యంగ్, డైనమిక్ సీఎం అంటూ ఎంపీ పరిమల్ నత్వానీ ట్వీట్

    వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియతమ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజారంజకంగా పాలించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తన శుభాకాంక్షలు తెలిపారు. యంగ్, డైనమిక్ చీఫ్ మినిస్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ వైసీపీ ఎంపీ పరిమల్ నత్వాని కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నా అంటూ పేర్కొన్నారు.

    మంత్రి బుగ్గన ట్వీట్ .. జగన్ సంక్షేమ పథకాలపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హల్చల్

    మంత్రి బుగ్గన ట్వీట్ .. జగన్ సంక్షేమ పథకాలపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హల్చల్

    ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ప్రజల్లో భరోసా కల్పించడం కాకుండా ఆ మాటను నిజం చేస్తూ మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలోనూ సీఎం జగన్ కు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. జగన్ ఏపీ సీఎం గా పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సంక్షేమ పథకాల విషయంలో దూసుకుపోతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో జగన్ అభిమానులు కొనియాడుతున్నారు. సీఎం జగన్ బెస్ట్ గవర్నెన్స్ అంటూ కితాబిస్తున్నారు .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+