Allu Arjun : అల్లు అర్జున్ కు వైఎస్ జగన్ కంగ్రాట్స్- RRR టీమ్ కూ.. ఏమన్నారంటే ?

ఇవాళ ప్రకటించిన 69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు తేజాలు సత్తా చాటాయి. ముఖ్యంగా పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా పలు విభాగాల్లో అవార్డులు గెల్చుకుంది. దీంతో తెలుగు వారంతా సంతోషంలో మునిగిపోయారు. అల్లు అర్జున్ తో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రంలో పనిచేసి అవార్డులు గెల్చుకున్న వారికి అభినందలు తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.

ఇదే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కూడా అల్లు అర్జున్ తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. పుష్ప చిత్రంలో నటనకు గాను తొలిసారిగా జాతీయ చలనచిత్ర అవార్డు (ఉత్తమ నటుడు) గెలుచుకున్న హీరో అల్లు అర్జున్‌ని, పాన్-ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోతున్న RRR చిత్రానికి అవార్డులపై సీఎం జగన్ అభినందనలు తెలిపారు.

ap cm ys jagan congratulates tollywood hero allu arjun for best actor award, RRR team also

69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని, ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఉత్తమ నటిగా అలియాభట్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప) సహా ఆరు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, చంద్రబోస్ ఉత్తమ సాహిత్యానికి (కొండ పొలం) ఇతర అవార్డులను గెలుచుకున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

ap cm ys jagan congratulates tollywood hero allu arjun for best actor award, RRR team also

టాలీవుడ్ పరిశ్రమ పెద్దలతో మొదట్లో అంటీ ముట్టనట్లుగా ఉన్న జగన్ ఆ తర్వాత సత్సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ రావడంతో ఈ మధ్య సైలెంట్ గా ఉంటున్నారు. ఈ తరుణంలో ఇంతమంది నటీనటులు, ఇతర సిబ్బందికి ఫిల్మ్ అవార్డులు రావడంతో వైఎస్ జగన్ అభినందనలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ స్పందనతో అవార్డులు గెల్చుకున్న నటుల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+