జగనన్న స్వచ్ఛ సంకల్పం ..క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ .. లక్ష్యం ఇదే !!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన 'క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)-జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమాన్ని విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ సర్కార్ చేపట్టిన మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సిడిని ఆవిష్కరించారు.

 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జగన్

చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లాప్‌ కార్యక్రమంలో ఏపీని స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. క్లాప్ కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజులపాటు కొనసాగనుంది. మొత్తం 4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. బెంజిసర్కిల్ నుంచి ఈ వాహనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరనున్నాయి.

ప్రజలు ఆరోగ్యంగా , ఆహ్లాదంగా జీవించటమే క్లాప్ ప్రధాన ఉద్దేశం

ప్రజలు ఆరోగ్యంగా , ఆహ్లాదంగా జీవించటమే క్లాప్ ప్రధాన ఉద్దేశం

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో, ఆహ్లాదంగా జీవనం సాగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 123 కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్‌ బిన్‌లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 13 వేలకు పైగా ఉన్న పంచాయితీలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది. పదివేల మంది గ్రామపంచాయతీ కార్మికులు ఈ కార్యక్రమానికి పనిచేయనున్నారు.

100 రోజులపాటు జగనన్న స్వచ్చ సంకల్పం

100 రోజులపాటు జగనన్న స్వచ్చ సంకల్పం


సేకరించిన చెత్తను వెస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలకు తరలించి చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయని, ఈ కేంద్రాల నిర్వహణకు నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి జీతభత్యాలు ఇచ్చి మరీ చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను నిర్మించనున్నారు. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ ద్వారా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత జగనన్న స్వచ్ఛ సంకల్పం వంద రోజుల పాటు కొనసాగనుంది.

జాతీయ సర్వేక్షణ్ లో ఉత్తమ అవార్డుల సాధనకు పోటీలో ఏపీ ..

జాతీయ సర్వేక్షణ్ లో ఉత్తమ అవార్డుల సాధనకు పోటీలో ఏపీ ..


ఇప్పటికే జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి, విశాఖ, విజయవాడలకు అవార్డులు వచ్చాయి. ముందు ముందు జాతీయ స్వచ్ఛ సర్వేక్షన్ లో మరింత మెరుగైన ర్యాంకు సాధించే దిశగా ఏపీ ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన క్లాప్ ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , కొడాలి నాని, బొత్సా సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి రోజు ఈ స్వచ్చ సంకల్పం తీసుకున్న జగన్ రాష్ట్రాన్ని స్వచ్చ ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దాలని భావిస్తున్నారు. గతంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+