YS Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్? ఆ పర్యటనలు రద్దు ! రెండ్రోజులు ముందుగానే ?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా... రెండు రోజులు ముందుగానే వెళ్లేందుకు సిద్ధంకావడం ఉత్కంఠ రేపుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమవుతోంది. ఇందులో పలు కీలక అంశాలపై ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ నెల 30న ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న జగన్, ఆ టూర్ ను కాస్త ముందుకు జరుపుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని కీలక పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ను ముందుకు జరుపుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవాళ మధ్యాహ్నం గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఆయన సడన్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది.

పొన్నూరు, హైదరాబాద్ టూర్లు రద్దు
వాస్తవానికి సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పొన్నూరు, అలాగే హైదరాబాద్ లో టూర్లు ప్లాన్ చేసుకున్నారు. వీటిని అర్ధాంతరంగా రద్దుచేసుకున్నట్లు నిన్న రాత్రి ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. దీంతో సీఎం జగన్ ఈ రెండు టూర్లు ఇంత అర్ధాంతరంగా ఎందుకు రద్దు చేసుకున్నారనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇందులో సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెళ్లేందుకే ఈ రెండు టూర్లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్లు రద్దు చేసుకున్న జగన్ ఉదయం మాత్రం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశాఖపై సమీక్ష మాత్రం కొనసాగిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి జగన్ ఢిల్లీ పయనం అవుతారని తెలుస్తోంది.

రాష్ట్రంలో తాజా పరిణామాలతో ?
తాజాగా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ఢిల్లీ పెద్దలతో అత్యవసరంగా చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. అందుకే ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లాల్సిన జగన్ రెండు రోజుల ముందుగానే కేంద్రంలో పెద్దల్ని కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అందుకే చివరి నిమిషంలో తన షెడ్యూల్డ్ టూర్లు రద్దు చేసుకుని హస్తిన బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీ నుంచి అపాయింట్ మెంట్ ఖరారైతే జగన్ టూర్ ఖరారవుతుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications