ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ , తెలుగులో విషెస్ చెప్పిన మోడీ

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా అచ్చమైన తెలుగు సంప్రదాయంలో ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి వస్త్రాలతో, చక్కని వస్త్రధారణలో కనిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, పలువురు మంత్రులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.

పంచాంగ శ్రవణం చేసిన పండితులు .. పాల్గొన్న వైఎస్ జగన్

పంచాంగ శ్రవణం చేసిన పండితులు .. పాల్గొన్న వైఎస్ జగన్

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి వేద పండితులు పంచాంగ శ్రవణం చేసి వినిపించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం తరువాత సీఎం జగన్ పలువురు పండితులను సన్మానించారు .
ఈ ఏడాది విద్యా విధానాలలో కొత్త మార్పులు వస్తాయని, సీఎం జగన్ అన్ని సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తారని, ఈ ఏడాది ప్రభుత్వానికి ఎన్నో విజయాలు సిద్ధించే అవకాశం ఉందని పంచాంగ శ్రవణం చేసిన పండితులు పేర్కొన్నారు.

ప్లవ నామ సంవత్సర ఉగాదికి జగన్ శుభాకాంక్షలు

ప్లవ నామ సంవత్సర ఉగాదికి జగన్ శుభాకాంక్షలు

ప్లవ నామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు బాగుంటాయని వారు తెలిపారు . రైతుల వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. పంచాంగ శ్రవణం అంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు . ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు , సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.

 తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు .. తెలుగులో ట్వీట్

తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు .. తెలుగులో ట్వీట్

ఇదిలా ఉంటే ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. మీరంతా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ అన్ని వర్గాలకు శాంతి , సామరస్యాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్ళలో ఆనందాల హరివిల్లు ఉగాది పండుగ , ప్రతి ఇంటా శుభం కలుగజేయాలని ఆకాక్షించారు . ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ ఉగాది పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+