ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం వైఎస్ జగన్ ఘనస్వాగతం

ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. కొత్త గవర్నర్ నజీర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం వెంట కీలక నేతలు, అధికారులు ఉన్నారు. గవర్నర్‌కు పలువురు మంత్రులు, అధికారులను పరిచయం చేశారు సీఎం జగన్.

సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్, మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొత్త గవర్నర్‌కు స్వాగతి పలికారు.

అనంతరం కొత్త గవర్నర్ జస్టిస్ నజీర్ దంపతులు రాజ్ భవన్ చేరుకున్నారు. ఎల్లుండి అంటే ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

AP CM YS Jagan welcomes new governor justice abdul nazeer.

అంతకుముందు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ ఘనంగా వీడ్కోలు పలికారు. గన్నవరం విమానాశ్రయంలో విశ్వభూషణ్‌కు సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు.

అనంతరం గవర్నర్ విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు. సుమారు 44 నెలలపాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసేందుకు సహకరించిన అందరికీ విశ్వభూషణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+