గవర్నర్ కు జగన్ ఘన వీడ్కోలు- ఎప్పటిలాగే సతీసమేతంగా వెళ్లి- పరస్పర ధన్యవాదాలు
ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఇవాళ బదిలీపై వెళ్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఘనవీడ్కోలు పలికారు. రాజ్ భవన్ కు ఎప్పటిలాగే సతీసమేతంగా వెళ్లి గవర్నర్ దంపతులతో కాసేపు భేటీ అయిన జగన్ దంపతులు.. అనంతరం వారిని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
తాజాగా కేంద్రం దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు కొత్త వారికి కూడా అవకాశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీ గవర్నర్ గా ఉన్న హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ కు పంపింది. ఆయన స్ధానంలో కొత్తగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించింది. దీంతో హరిచందన్ స్ధానంలో ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో ప్రస్తుత గవర్నర్ హరిచందన్.. ఛత్తీస్ ఘడ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు పలువురు వీడ్కోలు పలుకుతున్నారు.

ఇవాళ ఉదయం 11.30 గంటలకు విజయవాడ లోని రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్ దంపతులు అక్కడ గవర్నర్ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ గా ఆయన అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. దేవుడి ప్రతిమల్ని జ్ఞాపకంగా అందచేశారు.

మరోవైపు కీలక మైన రాజధాని బిల్లులతో పాటు పలు సందర్భాల్లోనూ జగన్ సర్కార్ నిర్ణయాలకు గవర్నర్ న్యాయపరిశీలన కూడా చేయకుండా ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఎన్నికల వేళ కేంద్రం గవర్నర్ల మార్పు ప్రక్రియ చేపట్టడంతో ఆయన పొరుగున్న ఉన్న ఛత్తీస్ ఘడ్ కు వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications