వైఎస్సార్ నే అవమానిస్తారా? సాక్షమిదే..! జగన్ పై కాంగ్రెస్ అటాక్ మొదలు...

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ రాష్ట్రంలో రెండు ప్రధాన విపక్ష పార్టీలు టీడీపీ,జనసేనతో పాటు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు కూడా సీఎం జగన్ టార్గెట్ గా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ సీఎం జగన్ కు చేసిన ఓ డిమాండ్, దాన్ని నెరవేర్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలతో కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఘాటుగా స్పందించారు.

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే జనవరి 22న పలు రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించాయని, కానీ జగన్ సర్కార్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే సెలవు ఇవ్వడం లేదని తాజాగా ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరి ఆరోపించారు. దీంతో వైసీపీ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలోనే జనవరి 22న సెలవు ప్రకటిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్తలొస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ రియాక్ట్ అయ్యారు.

ap congress incharge manickam tagore slams ys jagan for following bjp footsteps, insulting ysr

బీజేపీ కోరినట్లుగా సీఎం జగన్ జనవరి 22న సెలవు ఇచ్చేందుకు సిద్ధం కావడంపై మాణిక్కం ఠాకూర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇందుకు సాక్ష్యంగా ఓ పేపర్ క్లిప్ కూడా పెట్టారు. బీజేపీ అడుగు జాడల్లో నడుస్తూ తన తండ్రి వైఎస్సార్ ను అవమానిస్తున్నారని విమర్శించారు. ఇదే పరిస్ధితి కొనసాగితే వైసీపీ పేరుని బీజేపీపీగా మార్చుకోవాల్సి ఉంటుందని ఠాకూర్ తెలిపారు. వై ఇన్ సల్ట్ వైఎస్సార్, జగన్-బీజేపీ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+