7 వేలకు దిగువన ఏపీ కోవిడ్ కేసులు- 58 మరణాలు- గత 24 గంటల్లో
ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతోంది. అయితే పలు జిల్లాల్లో మాత్రం కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 6952 కొత్త కేసులు నమోదయ్యాయి. 58 మంది కరోనాతో చనిపోయారు. ప్రభుత్వం 24 గంటల్లో లక్షా 8 వేల శాంపిల్స్‌ను పరీక్షించింది. 11577 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్ని గమనిస్తే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1199 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 1167 కేసులు వెలుగుచూశాయి. మిగతా జిల్లాల్లో పరిస్ధితి అదుపులోనే ఉంది. పశ్చిమగోదావరిలో 663, ప్రకాశం 552, అనంతపురం 550, కడప 456, విశాఖ 436, గుంటూరు 426, కృష్ణా 392, శ్రీకాకుళం 383, కర్నూలు 251, విజయనగరం 249, నెల్లూరు 228 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో 18 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 17 లక్షల మంది కోలుకున్నారు. మరో 90 వేల యాక్టివ్ కేసులున్నాయి.

మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో చనిపోయారు. చిత్తూరులో 9, తూర్పుగోదావరిలో 6, అనంతపూర్‌లో 5, కృష్ణాలో 5, విశాఖలో 5, శ్రీకాకుళంలో 4, పశ్చిమగోదావరిలో 4, కర్నూల్లో 3, గుంటూరులో 2, విజయనగరంలో 2, కడపలో ఒకరు, నెల్లూరులో ఒకరు మరణించారు. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 11882 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications