సుఖశాంతులతో వర్ధిల్లాలి: భద్రాచలంలో చినరాజప్పకు పూర్ణకుంభ స్వాగతం
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం రామాలయాన్ని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప దర్శించుకున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పురోహితులు పూర్ణకుంభంతో ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. రెండు రాష్ట్రల తెలుగు ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని రాముడిని కోరుకున్నట్లు తెలిపారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.

నెల్లూరులో ఘనంగా శ్రీవారి వైభవోత్సవాలు
నెల్లూరులో నిర్వహిస్తున్న శ్రీవారి వైభవోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారికి అష్టదళ పాదపద్మారాధన సేవ జరిగింది. టిటిడి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారికి సేవలు ప్రారంభమయ్యాయి. తోమాల సేవ, కొలువు, అర్చన కార్యక్రమాలు జరిగాయి.
ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామి వారి సర్వదర్శనం సాయంత్రం వరకు కొనసాగనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ వైభోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
వైద్యడిని సస్పెండ్ చేసిన మంత్రి కామినేని
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ వైద్యుడిని ఏపి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కాలేజీలలో మంత్రి కామినేని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ వైద్యుడు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అతడిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, సరైన సమయానికి వైద్యులు హాజరుకాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, కాలేజీ ప్రిన్సిపాల్‌ను కూడా రిలీవ్ చేస్తున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications