Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ అప్పగించిన టాస్క్ కోసం చెన్నై చేరిన పవన్- సౌత్ హీరో

One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా మరో అడుగు ముందుకు పడింది. దక్షిణాదిన అత్యంత ప్రాధాన్యత గల సదస్సు ఏర్పాటైంది. చెన్నై దీనికి వేదిక అయింది. సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై తిరువాన్మియూర్ లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై సదస్సు జరుగనుంది.

బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఇందులో పాల్గొనడానికి కొద్దిసేపటి కిందటే ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకి వచ్చారాయన. ఎయిర్ పోర్టులో పలువురు బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

AP Deputy CM Pawan Kalyan arrives in Chennai to attend One Nation One Election meeting

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, కేఎస్ రాధాకృష్ణన్, ఎం చక్రవర్తి, అర్జునమూర్తి, అమర్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ వస్తోన్నారనే సమాచారం తెలుసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

వన్ నేషన్- వన్ ఎలక్షన్ సదస్సులో తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, అనిల్ కే ఆంటోనీ, డాక్టర్ అరవింద్ మీనన్, తమిళనాడు, కర్ణాటక బీజేపీ ఇన్ ఛార్జీ, తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, నారాయణన్ తిరుపతి ఇందులో పాల్గొననున్నారు.

అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి మధ్యంతర ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచనలు, సలహాలను అందజేస్తుంది. దానికి అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు.

ఇది అమలులోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ మేరకు ఇది వరకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు పలు సంకేతాలను కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఏడాదే ఎన్నికలు ఉంటాయని బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలూ గతంలో అంచనావేశాయి.

బీజేపీ, ఎన్డీఏ సంకీర్ణ కూటమి గెలిచే అవకాశాలు లేకపోతే తప్ప జమిలి ఎన్నికలు వాయిదా పడే అవకాశం దాదాపుగా లేవు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందనే పాయింట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులో స్పష్టంగా పొందుపరిచారు.

ఎన్నికల వాతావరణం తమకు అనుకూలంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుంటుందే తప్ప 2027లో జమిలి నిర్వహించాలని ఇదివరకే నిర్ణయం తీసుకుంది కూడా. సాధారణంగా ఆ ఏడాది ఫిబ్రవరి లేదా జూన్‌లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ గతంలో వార్తలు వెలువడ్డాయి.

దేశంలో జమిలి ఎన్నికలు కొత్తేమీ కాదు. 1951 నుండి 1967 వరకు లోక్‌సభ, అన్ని రాష్ట్రా శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1951- 52లో తొలిసారిగా లోక్‌సభ, శాసనసభలకు మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు. 1957, 1962, 1967 నాటి ఎన్నికల వరకూ అదే సంప్రదాయం కొనసాగింది.

కొన్ని రాష్ట్రాల శాసనసభలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి రావడం వల్ల 1968- 69 మధ్యకాలంలో జమిలికి తొలిసారిగా బ్రేక్ పడింది. 1970 నాటి లోక్‌సభ కూడా ముందస్తుగా రద్దయింది. ఆ తరువాత 1971లో లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి జమిలి మళ్లీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+