మధురైలో పవన్ కళ్యాణ్-టూర్ షెడ్యూల్ ఇదే..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ తమిళనాడులోని మదురైలో పర్యటిస్తున్నారు. గతంలో ఓసారి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమిళనాడు వెళ్లిన పవన్.. ఇవాళ మరోసారి ఆలయాల్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మదురై చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అక్కడి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తో పాటు పలువురు నేతలు ఇందులో ఉన్నారు.

తమిళనాడులో ఏటా జరిగే మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు మధురై చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారు. అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడు లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రావాలని తమిళనాడు బీజేపీ నేతల నుంచి అందిన ఆహ్వనం మేరకు పవన్ వెళ్లారు.

ap deputy cm pawan kalyan in tamilnadu s Madurai to visit temples

గతంలో రెండు రోజుల పాటు తమిళనాడు, కేరళలోని పలు ఆలయాల్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అక్కడి స్దానిక నేతలతో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాదిలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు పవన్ కళ్యాణ్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా ఆలయాలు సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ టూర్ల ప్రభావం ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి మేలు చేస్తుందా లేదా అన్నది వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+