గొప్ప విజనరీ పవన్ కళ్యాణ్.. అందుకు ఈ నిర్ణయమే సాక్ష్యం!!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక గొప్ప విజన్ తో ఏపీలో పాలన సాగిస్తున్నారు. ప్రజా హితం, పర్యావరణ హితం ఈ రెండే కీలక అంశాలుగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యర్ధాల నిర్వహణ, డంపింగ్ యార్డుల నిర్వహణ వంటి విషయాలలో కలిసి వచ్చే స్వచ్ఛందసంస్థలు, ప్రజలను భాగస్వాములను చేసి స్థానికసంస్థలు పర్యావరణహితంగా నిర్వహించాలని సూచించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరొక పర్యావరణహితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

వినాయక చవితి పండుగకు పవన్ నిర్ణయం
మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో వేడుకలను పర్యావరణహితంగా చేసుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వినాయక చవితి రోజున మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని పూజించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

AP Deputy CM Pawan Kalyan vision vinayaka chaviti to conduct eco friendly in pithapuram

మట్టి గణనాథుడిని పూజిస్తే పర్యావరణానికి మేలు
ఈ క్రమంలో ఆయన పలు కీలక సూచనలు కూడా చేశారు. మన వేడుకలు, ఉత్సవాలలో పర్యావరణహిత వస్తువులను వాడడం మేలు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వినాయకచవితి వేడుకలలో పర్యావరణానికి హితం చేసే మట్టి గణనాథుడిని పూజిస్తే మంచి జరుగుతుందని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగం మంచిది కాదని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని కూడా మన ఉత్సవాలలో తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ పేర్కొన్నారు.

పిఠాపురం నుండే ముందు దీనికి శ్రీకారం
దేవాలయాలలో ప్రసాదాన్ని బటర్ పేపర్ తో చేసిన కవర్లలో ఇవ్వడం సరికాదని, ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లు కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలు వాడాలని పవన్ సూచించారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల నుంచే మొదలుపెట్టాలని పవన్ అధికారులకు సూచనలు చేశారు. ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ముందు మార్పు తీసుకురాగలిగితే తర్వాత రాష్ట్రమంతా మార్పు తీసుకురావచ్చన్న భావనతో పవన్ దీనికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ గొప్ప విజన్
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పర్యావరణాన్ని కాపాడడానికి పెద్ద పీట వేస్తున్నాయి. పవన్ విజన్ భావితరాల బంగారు భవిష్యత్తు కోసం అని అనిపించేలా ఉంటున్నాయి. పవన్ తీసుకున్న నిర్ణయాలు పిఠాపురం నియోజకవర్గంలో అమలయితే పిఠాపురం నియోజకవర్గం నిజంగానే పర్యావరణహిత నియోజకవర్గంగా మారుతుంది. పవన్ పర్యావరణ శాఖ తనకు కావాలని తీసుకోవడం వెనుక ఆయనకు పర్యావరణం పట్ల ఉన్న శ్రద్ధ, ఆయన విజన్ స్పష్టంగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+