Raghurama: రఘురామపై దాడి యత్నం..! సొంత అడ్డాలోనే రాడ్లు, మేకులతో..!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (raghurama Krishnam raju) ఇవాళ ఓ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. తన సొంత నియోజకవర్గం ఉండి పరిధిలో ఉన్న ఓ రామాలయానికి వెళ్లి సందర్భంగా ఈ దాడి జరిగింది. రఘురామతో పాటు ఉన్న కూటమి నేతలకూ, స్థానికులకూ మధ్య జరిగిన వాగ్వాదం దాడుల వరకూ వెళ్లడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై పలువురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఉండి నియోజకవర్గంలో పరిధిలోకి వచ్చే ఆకివీడు పట్ఠణం పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామను ఓ వర్గం అడ్డుకుంది. రామాలయానికి ఆయన వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో రోడ్డుపైనే అవి నిలిచిపోయాయి. దీంతో రఘురామ కారు దిగి అక్కడికి వెళ్లారు. ఈ రామాలయం విషయంలో కొంతకాలంగా వివాదం నెలకొనడంతో రఘురామను స్దానికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాగ్వాదం కాస్తా దాడుల వరకూ వెళ్లడంతో రాడ్లు, మేకులతో కొందరు ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ap deputy speaker raghurama Krishnam raju narrowly escaped from attack while visiting temple

అయితే విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు, ఆయన అనుచరులు అక్కడి నుంచి రఘురామను పంపేశారు. అనంతరం రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపై దాడి చేశారు. కూటమి నాయకులపై రాడ్లతో ఓ వర్గం నేతలు దాడి చేయడంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. వీరిని అనంతరం ఆస్పత్రికి వెళ్లి రఘురామ పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఈ రామాలయం విషయంలో స్థానికులతో రఘురామ గొడవ పడుతున్నారు. ఇది కాస్తా ముదిరి ఇవాళ దాడుల వరకూ వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+