ఏపీ డీజీపీ సడన్ విజిట్... చెక్ పోస్టుల్లో పని చేస్తున్న పోలీసులతో, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు . కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో లాక్‌డౌన్‌ను సమర్ధవంతంగా పాటిస్తున్న నేపధ్యంలో ఏపీ డీజీపీ పోలీసుల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు గరికపాడు చెక్ పోస్ట్ ను సడన్ గా సందర్శించిన డీజీపీ ఏపీ రాష్ట్రంలోనికి వచ్చే ఇతర రాష్ట్రాల సరిహద్దులో వున్న చెక్ పోస్టుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో, సిబ్బందితోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

చెక్ పోస్టుల వద్ద పరిస్థితి వీడియో కాన్ఫరెన్స్ లో తెలుసుకున్న డీజీపీ

చెక్ పోస్టుల వద్ద పరిస్థితి వీడియో కాన్ఫరెన్స్ లో తెలుసుకున్న డీజీపీ

ఇక ఈ సందర్భంగా ఆయన ఎలాంటి వాహనాలను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారంటూ డీజీపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనాను నివారించేందుకు ఏపీ పోలీసు శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని, అందరూ కరోనా ఫైట్ లో ప్రజల రక్షణ కోసం పని చెయ్యాలని డీజీపీ చెప్పారు. ఏపిలోని అన్ని చెక్ పోస్ట్ లలో ఉన్న పరిస్థితి గురించి తెలుసుకున్నానని, 24 గంటల పాటు పోలీసు సిబ్బంది చెక్ పోస్టుల వద్ద పహారా కాస్తున్నారని ఆయన మీడియా కు తెలిపారు.

ఢిల్లీ మత ప్రచార సభకు వెళ్లి వచ్చిన వారికి కరోనా పరీక్షలు

ఢిల్లీ మత ప్రచార సభకు వెళ్లి వచ్చిన వారికి కరోనా పరీక్షలు

డాక్టర్లు, నర్సులు, ఏఎస్ఎమ్‌లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు రిస్క్ తీసుకుని‌ ప్రజల కోసమే పని చేస్తున్నారని కనుక వారికి సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు . ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి అత్యవసర, నిత్యవసర వాహనాలను మినహా ఎవరిని అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ మత ప్రచార సభకు వెళ్లి వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేయిస్తున్నామని , నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారిని ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగిందని పేర్కొన్నారు.

Recommended Video

    PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
    అనవసరపు పుకార్లు సృష్టిస్తే కేసులు తప్పవు

    అనవసరపు పుకార్లు సృష్టిస్తే కేసులు తప్పవు


    కరోనా ఉన్న వారికి భద్రత నడుమ చికిత్స నడుస్తోందని డీజీపీ వివరించారు. ఇలాంటి సమయంలో అనవసరపు పుకార్లు సృష్టించవద్దని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+