దిశ యాప్ ఉంటే అన్న తోడున్నట్లే- అవగాహనా సదస్సులో జగన్- కోటి డౌన్ లోడ్ల టార్గెట్

ఏపీలో మహిళలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వారంతా దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. యువతులు, మహిళల భద్రత కోసం 'దిశ' యాప్‌ తీసుకొచ్చామని..దీనితో కలిగే మేలును ప్రతి ఇంటికీ తెలియజేయాల్సిన అవసరముందని సీఎం జగన్‌ అన్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన తన మనసును కలచివేసిందని చెప్పారు.

విజయవాడ శివారు గొల్లపూడి గ్రామంలో మహిళా పోలీసులు, వాలంటీర్లతో 'దిశ' యాప్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. దిశ యాప్‌ను ఎంత ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేయించగలిగితే అంతగా అక్క చెల్లెమ్మలకు అది తోడుగా నిలుస్తుందన్నారు. ఈ యాప్‌ దేశవ్యాప్తంగా 4 అవార్డులు సాధించిందని చెప్పారు. ఇప్పటికే 17లక్షల డౌన్‌లోడ్లు జరిగాయన్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి యువతి, మహిళ దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జగన్ సూచించారు. రాష్ట్రంలో కనీసం కోటి మంది మహిళల మొబైళ్లలో దిశ యాప్‌ ఉండేలా చర్యలు చేపడుతున్నామని జగన్‌ వెల్లడించారు.

ap disha app supports like brother : cm jagan ask women to download in awareness meeting

మహిళలు తమ మొబైల్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే అన్న తోడుగా ఉన్నట్టే భావించవచ్చని సీఎం జగన్ ధీమాగా చెప్పారు. అనుకోని ఘటన ఎదురైనపుడు యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే నిమిషాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుంటారని.. యాప్‌ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్‌ వివరాలు నేరుగా కంట్రోల్‌ రూం, పోలీస్‌స్టేషన్‌కు చేరేలా పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించామన్నారు. ఇప్పటికే పోలీస్‌ గస్తీ వాహనాలను పెంచామని.. మరిన్ని పెంచుతామని సీఎం జగన్ చెప్పారు.

దిశ యాప్‌ వాడుకపై మహిళల్లో అవగాహన కల్పించాలని మహిళా పోలీసు సిబ్బంది, వాలంటీర్లకు జగన్‌ సూచించారు. అక్కచెల్లెమ్మలకు మేలు చేసే విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ వెనకడుగు వేయదన్నారు.దిశ యాప్ ను మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేందుకు అన్నిచర్యలు తీసుకోవాలని అధికారుల్ని జగన్ ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+