వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP EAMCET 2020 Results:ఇంజినీరింగ్‌లో బాలురదే పైచేయి...ఫలితాలు ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలంటే..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తరపు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ కాకినాడ ఈ పరీక్షను నిర్వహించింది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 1,56,953 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వ్యవసాయం, ఫార్మసీలో 75వేల 834 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయిన 77 మంది విద్యార్థులకు బుధవారం పరీక్ష నిర్వహించారని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

ఇక కరోనా కష్టకాలంలో కూడా ఎంసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా యంత్రాంగంను మంత్రి సురేష్ అభినందించారు. ఇంజనీరింగ్‌లో 87.78శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా... అగ్రికల్చర్ విభాగంలో 91.77శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ప్రభుత్వ జీవో ఆధారంగా 75శాతం ఎంసెట్ పరీక్షలో వచ్చిన మార్కులు 25శాతం ఇంటర్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటించడం జరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఫలితాలు మొబైల్ నెంబర్లుకు కూడా వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

AP EAMCET 2020 Results: 84 Percent in Engineering and 91 percent in Agriculture passed

Recommended Video

TS EAMCET 2020 : Guidelines For Students ఆ సర్టిఫికేట్ తప్పనిసరి ! || Oneindia Telugu

ఇక ఇంజనీరింగ్‌లో బాలురదే పైచేయి అని చెప్పిన ఆదిమూలపు సురేష్... టాప్ టెన్ ర్యాంకులను ప్రకటించారు. మొదటి ర్యాంకును విశాఖపట్నంకు చెందిన శ్రీనాథ్ సొంతం చేసుకోగా మెడిసిన్‌లో తెనాలికి చెందిన చైతన్య సింధు అనే అమ్మాయి తొలి ర్యాంకు సొంతం చేసుకుంది. ఇక ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. ముందుగా హోమ్ పేజ్‌పై AP EAMCET 2020 పై క్లిక్ చేయండి. ఆ తర్వాత " AP EAMCET 2020 results" అనే లింక్‌పై క్లిక్ చేయండి. ఆపై మీ వివరాలను ఇవ్వండి. వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌ పై కనిపిస్తాయి. భవిష్యత్తు కోసం ర్యాంకు కార్డును డౌన్‌లోడ్ చేసుకుని పెట్టండి.

English summary
AP EAMCET 2020 results were released by Education minister AdiMulapu suresh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X