వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా ? పరీక్ష తేదీ, ఇతర వివరాలివే....

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఈ ఏడాది ఎంసెట్ పరీక్ష హాల్ టికెట్లను ప్రభుత్వం ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. వీటిని విద్యార్ధులు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే విధానం, పరీక్ష తేదీ, సమయాలు, ఇతర వివరాలను కూడా వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచింది. విద్యార్ధులు ఈ వివరాలను సులువుగా తెలుసుకునేందుకు ఇక్కడ ఇస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఎంసెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. sche.ap.gov.in వెబ్ సైట్లో ప్రభుత్వం వీటిని అందుబాటులో ఉంచింది. ఇందులోనూ హాల్ టికెట్లు ఎలా డౌన్ లోడు చేసుకోవాలో కూడా వివరించారు. అభ్యర్ధులు ముందుగా రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ నంబర్ ను మరో కాలంలో ఇవ్వాల్సి ఉంటుంది. మూడో కాలంలో అభ్యర్ధి పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. కిందనున్న ప్రోసీడ్ బటన్ నొక్కగానే హాల్ టికెట్లు డౌన్ లోడ్ అవుతాయి.

AP EAMCET- How to download hall tickets ?, exam dates and other details

ఈ ఏడాది ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రశ్నాపత్రాల ముద్రణతో పాటు ఇతర ఏర్పాట్లూ పూర్తి చేస్తోంది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 7 వరకూ వివిధ విభాగాల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అదే సమయంలో ప్రైవేటు కళాశాలల్లోనూ నేరుగా ప్రవేశాలకు వీలు కల్పిస్తున్నారు. గతంలో పోలిస్తే ఎంసెట్ కు ఆదరణ తగ్గినా ఇప్పటికీ పలు కోర్సుల్లో చురుగ్గా ప్రవేశాలు ఉంటున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే విద్యార్ధులు భారీ సంఖ్యలో ఎంసెట్ కు హాజరవుతారని ఆశిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కోవిడ్ మార్గదర్శకాలతోనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

English summary
andhrapradesh government has made available hall tickets of eamcet 2021 online today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X