ఏపీ ఈఏపీసెట్ ఫలితాల తేదీ ఖరారు: ఎప్పుడంటే?, ఇలా తెలుసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్(AP EAPCET) 2023 ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీ రంగ జనార్థన, కన్వీనర్ ప్రొఫెసర్ సీ శోభా బిందు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కే హేమచంద్రారెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22,23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

AP EAPCET 2023

ఇటీవల ఏపీ ఈఏపీసెట్ ప్రాథమిక కీ, రెస్పాన్స్ సీట్లను విడుదల చేశారు అధికారులు. మే 24 నుంచి 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం జేఎన్టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన మార్కులకు 25 శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. ఫలితాలను

జూన్ 14వ తేదీన ఈఏపీసెట్(AP EAPCET) 2023 ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+