టెన్త్ విద్యార్ధులకు ఇక నుంచి కొత్తగా - ప్రభుత్వం మార్గదర్శకాలు, తప్పనిసరి..!!
ఏపీ ప్రభుత్వం విద్యార్ధుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం తాజాగా అన్ని పాఠశాలల్లో అమలు చేసే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధానం అమలు ద్వారా విద్యార్ధులు ఎలాంటి ఆందోళన.. ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరు కాగలుగుతారని భావిస్తు న్నారు. కాగా.. ఇప్పుడు ఈ విధానం ప్రతీ పాఠశాలలోనూ అమలు చేయాలని విద్యా శాఖ తమ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా వారిలో పరీక్షల ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు ఉదయం, మధ్యాహ్నం మొదటి పీరియడ్‌లలో తొలి 10 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలని ఉపాధ్యాయులకు సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. విశ్రాంతి పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిరోజూ చివరి పీరియడ్‌లో పోటీ లేని ఆటలు ఆడించాలని పేర్కొంది.

ప్రధానోపాధ్యాయులు, తరగతి ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు చేయవల్సిన పనులను విడివిడిగా వివరించింది. ప్రతిరోజూ ఉదయం అసెంబ్లీలో అకడమిక్ ఒత్తిడి, పరీక్షల ఆందోళన తగ్గించి, వారిలో స్ఫూర్తి నింపేలా ప్రసంగాలు చేయించనున్నారు. పాఠశాల ప్రాంగణంలోని ముఖ్య ప్రదేశాల్లో ఒత్తిడి నిర్వహణ, ఎదుర్కొనే విధానంపై పోస్టర్లు ప్రదర్శన నిర్వహించనున్నారు.
విద్యార్ధుల్లో పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయం, సహచరులతో పోలిక, ఆందోళన, డిప్రెషన్ ఎదుర్కొనేలా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చింది. అలాగే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను ఉపాధ్యాయులతో చర్చించే అవకాశం కల్పించడంతో పాటు, సహాయ బాక్సులు కూడా పెట్టనున్నారు. పిల్లలకు క్రమశిక్షణా బెదిరింపు లు ఉండకూడదు. ఉపాధ్యాయులు వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
వారితో స్నేహభావంతో మెలగాలని స్పష్టం చేసింది. పాఠశాల ప్రాంగణంలో నడక, తోట పనులు చేపట్టి, పిల్లల్లో ప్రశాంత త, ఏకాగ్రత పెంపొందించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్దేశించారు. ప్రతీ విద్యార్ధి తమ బలబలాలు అర్థం చేసుకునేలా చూడాలి. వారి తల్లిదండ్రులకు వాస్తవ పరిస్థితులను వివ రించాలి. పరీక్షలకు సిద్ధం అయ్యే వేళ స్క్రీన్ టైం నియంత్రించాలి. కౌమార దశలో కనిపించే మూడ్ స్వింగ్స్ వంటి భావోద్వేగ మార్పుల పై విద్యార్థులకు సున్నితంగా మార్గనిర్దేశం చేయాలని విద్యాశాఖ నిర్దేశించింది.
-
పీఎం కిసాన్ నిధులు జమ కాలేదా - అయితే, ఇలా చేస్తే వెంటనే..!! -
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో పథకం అమలుకు నిర్ణయం..!! -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
నిరుద్యోగులకు ఉగాది కానుక, 10వేల ఉద్యోగాలు భర్తీ- ఏ శాఖలో ఎన్ని..!! -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
ఏపీలో మరో పథకం అమలుకు నిర్ణయం, భారీగా లబ్ది - మార్గదర్శకాలు..!! -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
ఏపీలో ఫీజురీయింబర్స్ మెంట్ పై గుడ్ న్యూస్..! సర్కార్ కీలక నిర్ణయం..! -
Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ ఖరారు? ఇవాళ సర్కార్ కీలక భేటీ..! -
పదో తరగతి పరీక్షల వేళ విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, విద్యా శాఖ కీలక సూచనలు..!! -
విద్యార్ధుల కు రేవంత్ ఊహించని వరం, ఇక నుంచి కొత్తగా..!! -
విద్యార్థులకు శుభవార్త.. పీహెచ్డీ స్కాలర్స్ కు 15వేలు, పీజీ వాళ్ళకు 12వేలు.. స్టైఫండ్ పెంపు!











Click it and Unblock the Notifications