జగన్ సర్కార్ తో తాడోపేడో-సిద్ధమైన ఉద్యోగులు-భవిష్యత్ కార్యాచరణ ఖరారుకు కీలక భేటీ

ఏపీలో ఉద్యోగ సంఘాలు మరోసారి పోరు బాట పట్టనున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా పీఆర్సీ వ్యవహారం ఇంకా తేలకపోవడం, ఇతర కీలక సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాని నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ సమావేశమవుతున్నాయి. ఉద్యోగ సంఘాల స్ట్రగుల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఇందులో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని ఉద్యోగులు ఇప్పటికే ప్రకటించారు.

ఉద్యోగుల్లో అసహనం

ఉద్యోగుల్లో అసహనం

గత పీఆర్సీ గడువు ముగిసిపోయినా ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకటించకుండా కాలయాపన చేస్తుండటం, ఈ వ్యవహారంలో పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగ సంఘాల్లో అసహనం పెరుగుతోంది. ప్రభుత్వం పదే పదే చర్చల పేరుతో ఆహ్వానిస్తున్నా అందులో ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఈసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ఉద్యోగ సంఘాల్ని సైతం మూడు గ్రూపులుగా విభజించి అధికారులు చర్చలు జరపడం వంటి అంశాలు ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాలో తెలియక ఉద్యోగ సంఘాలు మథనపడుతున్నాయి.

 పీఆర్సీపై ఇంకా పీటముడి

పీఆర్సీపై ఇంకా పీటముడి

కీలకమైన పీఆర్సీ వ్యవహారంలో ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించడం లేదు. గతంలో సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని ప్రతిపాదిస్తోంది. అయితే 14.29 ఫిట్ మెంట్ ఇస్తే ఉద్యోగులు ప్రస్తుతం తీసుకుంటున్న జీతాలు తగ్గుతాయనే ఆందోళన ఉంది. గతంలో 27 శాతం ఐఆర్ ప్రకటనే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం కనీసం 45 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తేనే తమకు ఫలితం ఉంటుందని ఉద్యోగులు చెప్తున్నారు. కానీ చివరికి ప్రభుత్వం తెలంగాణతో సమానంగా 30 శాతం ఫిట్ మెంట్ కు మించి ఇవ్వలేమనే సంకేతాలు ఇస్తోంది. దీంతో పీఆర్సీపై పీటముడి కొనసాగుతోంది.

 జగన్ అపాయింట్ మెంట్ కరవు

జగన్ అపాయింట్ మెంట్ కరవు

ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు చెప్పుకునేందుకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరుతున్నారు. మధ్యలో ఉన్న అధికారులతో చర్చించి ప్రయోజనం లేదని భావిస్తున్న ఉద్యోగులు.. నేరుగా సీఎం జగన్ తో అపాయింట్ మెంట్ ఇప్పించమని అధికారుల్ని కోరుతున్నారు. కానీ పీఆర్సీ ఫిట్ మెంట్ వ్యవహారం తేలకుండా జగన్ అపాయింట్ మెంట్ దొరికే పరిస్ధితులు లేవు. దీంతో ఉద్యోగులు మధ్యలో ఉన్న అధికారులతో చర్చించలేక, అలాగని జగన్ అపాయింట్ మెంట్ దొరక్క ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్ధితుల్లోకి వెళ్తున్నారు.

ఈసారి సర్కార్ తో తాడోపేడో ?

ఈసారి సర్కార్ తో తాడోపేడో ?

గతంలో ఓసారి ఉద్యమం మొదలుపెట్టి ఆ తర్వాత అధికారుల మాటలు విని ప్రభుత్వంపై నమ్మకంతో దాన్ని విరమించుకున్న ఉద్యోగ సంఘాలపై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రభుత్వం ఉద్యోగుల్ని మోసం చేసిందనే భావనలో వీరంతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం సీఎం జగన్ తిరుపతిలో ఇచ్చిన ప్రకటన, సలహాదారు సజ్జల ఇచ్చిన హామీలు అమలు కాకపోవడమే. దీంతో మరోసారి స్ట్రగుల్ కమిటీ భేటీ నిర్వహించి పీఆర్సీ సహా ఇతర సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇవాళ ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీతో పాటు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా సమావేశమై సర్కార్ తో తాడోపేడో తేల్చుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+