ఏపీ సర్కార్ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్ల చిట్టా..! పీఆర్సీ, ఐఆర్ సహా ఇవే..!

ఏపీలో మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ ఉద్యోగ సంఘాలతో (AP Employee Unions) సమావేశమైంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు డిమాండ్లపై వారితో చర్చించింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు పలు డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచాయి. వీటిలో కీలకమైన పీఆర్సీ కమిషన్ నియామకం, ఆలోపు ఐఆర్ చెల్లింపు, అలాగే డీఏ బకాయిల వంటి అంశాలతో పాటు మరికొన్ని ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. వీటి పరిష్కారంపై ఉద్యోగ నేతలతో మంత్రులు చర్చించారు.

ఏపీలో 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాలు మంత్రుల్ని కోరాయి. అలాగే ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ గా ప్రకటించాలని కోరాయి. దీంతో పాటు డీఏ బకాయిల చెల్లింపుకు సంబంధించి పెండింగ్ ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు బిల్ సబ్మిట్ చేయడానికి వీలుగా మాడ్యూల్ వెంటనే నిధి పోర్టల్ లో పెట్టాలని కోరాయి. పెన్షనర్ల బకాయిలు చాలా వరకు చెల్లించినప్పటికి ఇంకా కొంతమందికి గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్ చెల్లించని విషయాన్ని పరిశీలించి, వెంటనే వారికి బకాయిలు చెల్లించాలని అడిగాయి.

AP Employee Unions Press Govt on PRC IR DA Dues Submit Key Demands

ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని మరో కీలక డిమాండ్ ను ఉద్యోగ సంఘాలు కోరాయి. మునిసిపల్ టీచర్ల పిఎఫ్ సమస్యను పరిష్కారం చేయాలని, కమిషనర్ పరిధిలో ఉన్న అకౌంట్లలోని సొమ్ము లోన్లు, పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్లు చెల్లించేందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని, జిల్లా పరిషత్ టీచర్ల పిఎఫ్ ను జిపిఎఫ్ మాదిరి ఆన్ లైన్ చేయాలని, మోడల్ స్కూల్ సొసైటీ రద్దు చేసి విద్యాశాఖలో పూర్తిగా విలీనం చేయాలని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్ లో ఉన్న తెలుగు, హిందీ పిజిటి పోస్టులు ఫైల్ వెంటనే అప్రూవల్ చెయ్యాలని కూడా కోరాయి.

వీటితో పాటు గురుకుల సీఆర్టీలు అందరినీ రెన్యూవల్ చేయాలని, ఫైనాన్స్ వద్ద ఉన్న రెండు ఫైళ్ళని వెంటనే అప్రూవ్ చేయాలని, కోవిడ్ సమయంలో చనిపోయిన పంచాయతీ రాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వెంటనే కల్పించాలని, అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్న కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి, మిగిలిన వారికి కూడా ఉన్న అభ్యంతరాలను సానుభూతితో తొలగించి రెగ్యులరైజ్ చేయాలని కోరాయి. అలాగే తెలంగాణా ప్రభుత్వంతో సంప్రదింపులు వేగవంతం చేసి అంతర్ రాష్ట్ర బదిలీలు త్వరితగతిని పూర్తి చేయాలని కోరాయి. సచివాలయం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆరు సంవత్సరాల ఇంక్రిమెంట్లు ని మంజూరు చేయాలని, ఉద్యోగుల బైఫర్ కేషన్ సందర్బంగా మెంటల్లి రిటార్టెడ్ spouse కలిగిన ఉద్యోగులకు కూడా ప్రిఫెరెన్సు ఇవ్వాలని అడిగాయి. ప్రమోషన్ తీసుకుని రివర్స్ అయిన ఉపాధ్యాయులకు మొత్తం సర్వీస్ ని పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

AP Employee Unions Press Govt on PRC IR DA Dues Submit Key Demands

భార్యాభర్తలను ఒకే చోటుకు తెచ్చేందుకు తగిన అవకాశాలు పరిశీలించాలని, సాధ్యం కాని పక్షంలో ఉమ్మడి జిల్లా పరిధిలో అంతర్ జిల్లా బదిలీలు నిర్వహిస్తూ మూడు సంవత్సరాలపాటు అవకాశం ఇవ్వాలని, సర్వీస్ సీనియారిటీకు రక్షణ ఇవ్వాలని కోరాయి.
ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించేందుకు అధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో కమిటీ వేయాలని కోరాయి.
లోకల్ క్యాడర్ ఆర్గనైజషన్లో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణించాలని కోరాయి. టెట్ రద్దుకు విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రావాలని కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్పెషల్ టెట్ లో ఉపాధ్యాయులు కోరుతున్న మినహాయింపులు సానుభూతితో పరిశీలించి ఆందోళనలో ఉన్న టీచర్లకు ఉపశమనం కలిగించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+