Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాపై దాడులకు పాల్పడేది వారే: టీచర్ల పీఆర్సీ ఉద్యమంపై ఉద్యోగ సంఘాల నేత కీలక వ్యాఖ్యలు

అమరావతి: ఉద్యోగులకు 27 శాతం ఫిట్‌మెంట్ ఇస్తుందని తాము భావించామని, అది కార్యరూపం దాల్చకపోవడం తమకు నిరాశను కలిగించిందని ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. 27 శాతం ఫిట్‌మెంట్ కోసం తాము చిత్తశుద్ధితో ప్రభుత్వంతో పోరాడామని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో తాము ఎక్కడా లాలూచీ పడలేదని, ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనలేదని అన్నారు. 27 శాతం ఫిట్‌మెంట్‌ను సాధించుకోగలిగితే లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో సంతోషిస్తారని భావించామని చెప్పారు.

 27 శాతం సాధించలేకపోయాం..

27 శాతం సాధించలేకపోయాం..

ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. తాము అనుకున్న విధంగా 27 శాతం ఫిట్‌మెంట్ రాలేదని, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ప్రభుత్వం 23 శాతానికే అంగీకరించిందని సూర్య నారాయణ చెప్పారు. 27 శాతం ఫిట్‌మెంట్‌ను సాధించలేకపోయినందుకు ఉద్యోగ సంఘాల నేతలపై నిందలు వేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత ప్రయోజనాల కోసమంటూ ఆరోపణలు..

సొంత ప్రయోజనాల కోసమంటూ ఆరోపణలు..

ఉద్యోగ సంఘాల నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారనే అభిప్రాయాన్ని కలిగించడానికి కొంతమంది ప్రయత్నిస్తోన్నారని సూర్య నారాయణ చెప్పారు. ఆయా సంఘాల నాయకులకు ఇది సరికాదని అన్నారు. ఐక్యంగా పోరాడాల్సిన ఉద్యమాల్లో అది సాధ్యపడుతుందా అని మాత్రమే తాను పీఆర్సీ సాధన సమితి తరఫున ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశానని ఆయన వివరించారు. తాను ఇప్పుడు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.

పీఆర్సీలో వెనక్కి తగ్గలేదు..

పీఆర్సీలో వెనక్కి తగ్గలేదు..

హెచ్ఆర్ఏ విషయంలో తాము వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. తెలంగాణతో సమానంగా హెచ్ఆర్ఏను సాధించామని స్పష్టం చేశారు. పీఆర్సీని అయిదు సంవత్సరాలకు ఇచ్చేలా చూశామని చెప్పారు. పీఆర్సీ సాధన విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరోసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

దాడి చేస్తే అది వారి విజ్ఞతకే..

దాడి చేస్తే అది వారి విజ్ఞతకే..

తమ మీద దాడి చేస్తే.. అది ఉపాధ్యాయ సంఘాల విజ్ఞతకే వదిలి వేస్తున్నానని సూర్యనారాయణ చెప్పారు. ఈ ఉద్యమంలో కొంత మేర రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉన్నట్లు కనిపిస్తోందని సూర్యనారాయణ అనుమానాలను వ్యక్తం చేశారు. రాజకీయ ప్రమేయం ఉందని తాము అభిప్రాయపడుతున్నామని చెప్పారు. ఈ ఉదయం నుంచి తమ ఇళ్ల వద్ద ప్రభుత్వం పోలీసులను బందోబస్తుగా పెట్టిందని అన్నారు. పోలీసులను ఇళ్ల వద్ద ఎందుకు కాపలా పెట్టారో అర్థం కాలేదని చెప్పారు.

ముగిసిన పీఆర్సీ అధ్యాయాన్ని తెరిపించాం..

ముగిసిన పీఆర్సీ అధ్యాయాన్ని తెరిపించాం..

కొందరు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు.. ఉపాధ్యాయుల ముసుగులో తమ ఇళ్ల మీద దాడి చేస్తారని, కుట్రలు చేస్తారనే సమాచారం పోలీసుల వద్ద ఉండటమే దీనికి కారణం అయి ఉండొచ్చని సూర్యానారాయణ అన్నారు. ఆ కారణంతోనే తమ ఇళ్ల వద్ద పోలీసులను కాపాల పెట్టినట్టు అభిప్రాయపడుతున్నామని అన్నారు. తమకు పోలీసుల రక్షణ అవసరం లేదని స్పష్టం చేశారు. తాము నిజాయితీగా ముగిసిపోయిన పీఆర్సీ అధ్యాయాన్ని తాము నలుగురం ఒకేతాటిపైకి తీసుకొచ్చి దాన్ని మళ్లీ తెరిపించగలిగామని, ఈ వాస్తవాన్ని ఉద్యోగులు అర్థం చేసుకున్నారని చెప్పారు.

Recommended Video

    AP PRC: Chalo Vijayawada ఆత్మరక్షణలో AP Govt సమ్మెను అడ్డుకునేదెలా? | Andhra Pradesh| OneindiaTelugu
     మాకు అండగా ఉద్యోగులు..

    మాకు అండగా ఉద్యోగులు..

    తమపై ఉపాధ్యాయులో.. లేక వారి ముసుగులో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు దాడులకు పాల్పడితే తమను ఉద్యోగులే కాపాడుకుంటారని సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. తమ నిజాయితీని ఉద్యోగులు విశ్వసిస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యోగులు రక్షణగా నిలిచి.. తమను కాపాడుకుంటారని నమ్ముతున్నామని, అందుకే పోలీసుల భద్రత అవసరం లేదని అన్నారు. ఉపాధ్యాయుల పీఆర్సీ ఉద్యమంలో బయటి వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారో.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+