జగన్ కు ఉద్యోగ నేతల థ్యాంక్స్- సీఎం భావోద్వేగం-జీపీఎస్ పై కీలక వ్యాఖ్యలు..

ఏపీలో ఉద్యోగులు ఎప్పటినుంచో పోరాడుతున్న పలు అంశాలపై ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ గతంలో ఇచ్చిన హామీల మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు, హెచ్ఆర్ఏ పెంపు వంటి నిర్ణయాల్ని కేబినెట్ ప్రకటించింది. దీంతో ఉద్యోగ సంఘాలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఉద్యోగ నేతలు సీఎం జగన్ ను కలిశారు.

ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్‌ ప్రకడించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.

apjsemployeesjagan

ఈ సందర్భంగా జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని జగన్ తెలిపారు. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములన్నారు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది అని వారితో అన్నారు. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశం అని వారికి వివరించారు.
అందుకే పెన్షన్ సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డామని జగన్ తెలిపారు.

గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడ్డ సందర్భాలు లేవని ఉద్యోగ నేతలతో జగన్ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దష్టిలో ఉంచుకోవాలన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకుని జీపీఎస్ తీసుకువచ్చామన్నారు. రిటైర్డ్‌ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్ ను రూపొందించామని తెలిపారు. 62 ఏళ్లకు రిటైర్‌అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని సీఎం జగన్ తెలిపారు. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామని సీఎం వెల్లడించారు.

apjsemployeesjagan

ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలన్నారు. సీపీఎస్లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయని, రెండేళ్ల పాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘ కసరత్తు చేసిందని సీఎం పేర్కొన్నారు. దీని ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేశామన్నారు. కాంట్రాక్ట్‌ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి తీసుకున్నట్లు జగన్ తెలిపారు. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశామన్నారు. అలాగే వైద్యవిధాన పరిషత్‌ఉద్యోగులనుకూడా ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+