మద్యం కొనాలంటే ఇక ఇది తప్పనిసరి - ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలు.. ధరల్లో కీలక మార్పులు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. బ్రాండెడ్ మద్యం తో పాటుగా రూ 99 కే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచింది. తాజాగా మద్యం ధరలు ప్రతీ సీసా పైన రూ 10 చొప్పున పెంచింది. ఇక.. ఇప్పుడు మందు కొనాలంటే కొన్ని నిబంధనలను తప్పని సరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. లిక్కర్ సేల్స్ ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. బ్రాండెడ్ మద్యం తో పాటుగా రూ 99 క్వార్టర్ లిక్కర్ అమ్మకాలు అంచనాలకు అనుగుణంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలోనే కొద్ది రోజులు గా బార్ల నిర్వాహకుల అభ్యర్ధనల మేరకు ఎక్సైజ్ శాఖ కొన్ని నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా బార్ పాలసీలో కీలక మార్పులు తెచ్చారు. బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. ఇది బార్ల లైసెన్సీలకు పెద్ద ఊరటగా మారనుంది. ఇకపై బార్లకు, మద్యం షాపులకు సరఫరా చేసే మద్యం ధరలు ఒకేలా ఉండనున్నాయి. అదే సమయం లో ప్రతీ బాటిల్ మద్యం అమ్మకం పైన రూ 10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ 99 మద్యం, బీర్ల పైన పెంపు ప్రభావం ఉండదని అధికారులు స్పష్టం చేసారు.

అదే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం సీసాలపై కొత్తగా లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్(లిన్)ను తీసుకొచ్చేందుకు రూల్స్‌కు సవరణ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. లిక్కర్, బీరు, వైన్ రూల్స్‌కు సవరణలు చేసింది. ఇకనుంచి ప్రతిసీసాపై ఏపీ, బ్రాండ్, బ్యాచ్, లైన్, తేదీ, మిల్లీ సెకన్లతో సహా సమయాన్ని కోడ్ రూపంలో ముద్రిస్తారు. దీనివల్ల నకిలీ మద్యం సీసాలను వెంటనే గుర్తుపట్టొచ్చని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. నకిలీ మద్యం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. ఈ నిర్ణయం ద్వారా ఎలాంటి సమస్య లేకుండా విక్రయాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ ప్రతీ సీసా పైన క్యూ ఆర్ కోడ్ తీసుకొచ్చింది. అయితే.. వినియోగదారులు అందరి వద్దా మొబైల్ ఫోన్లు అందుబాటులోని లేని అంశం తెర మీదకు వచ్చింది. ఈ సమయంలో ప్రతీ బాటిల్ పైన గుర్తింపు నెంబర్ ద్వారా అమ్మకాలు సాగించాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications