AP Exit Polls 2024: ఏపీ లోక్ సభ పోరులో వారికే ఎడ్జ్- తేల్చేసిన జాతీయ మీడియా..!
దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై ఇవాళ పలు జాతీయ మీడియా సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. ఇందులో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటర్లు పట్టం గట్టారన్న దానిపై స్పష్టమైన అంచనాలను ఇచ్చాయి. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఓటర్లు వైసీపీ, ఎన్డీయే కూటమి పార్టీల్లో ఎవరికి ఓటేశారన్న దానిపై దాదాపు ముక్త కంఠంతో గణాంకాలను వెలువరించాయి. దీంతో లోక్ సభ పోరులో ఏపీ ఓటరు నాడి ఎలా ఉందో తేలిపోయింది.
జాతీయ మీడియా సంస్ధ న్యూస్ 18 మెగా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏపీలోని 25 లోక్ సభ సీట్లలో ఎన్డీయే కూటమికి ఏకంగా 19-22 సీట్లు లభిస్తాయని తేల్చింది. అలాగే వైసీపీకి 5-8 సీట్లు లభిస్తాయని తెలిపింది. ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ లోనూ ఎన్డీయే కూటమికి 21-25 సీట్లు లభించే అవకాశం ఉందని తేలింది. వైసీపీకి 0-4 సీట్లు లభించే అవకాశం ఉందని ఏబీపీ పోల్ తెలిపింది. మరో ఛానల్ న్యూస్ ఎక్స్ ఎన్డీయే కూటమికి 18 ఎంపీ సీట్ల వరకూ రావొచ్చని అంచనా వేసింది. అలాగే వైసీపీకి 7 సీట్లు వస్తాయని తెలిపింది.

సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ లో ఏపీలో ఎన్డీయే కూటమికి 17-23 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. అలాగే వైసీపీకి 3-5 సీట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ లెక్కన చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగితే కూటమికి భారీ విజయం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అలా కాకుండా క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం ఫలితాల్లో మార్పులు ఉండొచ్చని అంచనా.












Click it and Unblock the Notifications