AP Exit Polls: ఆ పార్టీకి హీన పక్షం 120 సీట్స్: ఫిక్స్ అయిపోండి
AP Exit Polls 2024: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ధీమాగా ఉంటోన్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటోన్నారు.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

కాగా ఈ సాయంత్రం 6:30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కసారిగా వెలువడటం ప్రారంభమైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చు.
ఇండియాటుడే- మైయాక్సిస్, చాణక్య, ఇండియా టీవీ, న్యూస్ 18, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ- జన్ కీ బాత్, టైమ్స్ నౌ ఈటీజీ.. వంటి పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీ- తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు. కొందరు ప్రముఖ సెఫాలజిస్టులూ తమ అంచనాలను విడుదల చేశారు.
ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థా దాస్.. తన అంచనాలను విడుదల చేశారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై స్పష్టతనిచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటుందని పార్థా దాస్ తెలిపారు.
ఈ అంచనాల ప్రకారం- వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. లోక్‌సభలో కూడా వైఎఆర్సీపీదే ఆధిపత్యం కొనసాగుతుంది. మొత్తంగా వైఎస్ఆర్సీపీకి 50 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. జనసేన- భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమి కట్టినా తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం తప్పకపోవచ్చు.
టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి.. 55 నుంచి 65 స్థానాలు మాత్రమే దక్కుతాయి. మరోసారి ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి తలెత్తవచ్చు. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం.. 46గా లెక్క కట్టారు పార్థా దాస్. పురుషుల ఓట్లల్లో టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీ నాలుగు శాతం వరకు వెనుకంజ వేసినప్పటికీ.. మహిళల ఓట్లల్లో మాత్రం ఏకంగా 12 శాతం మేర ముందంజలో ఉంది.












Click it and Unblock the Notifications