వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వండి - మంత్రి నిర్మలతో ఏపీ మంత్రి బుగ్గన భేటీ - కీలక అంశాలివే

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పాత బకాయిల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరినట్లు ఆయన చెప్పారు. నిర్మలతో భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు.

మోదీ, షా చెప్పినా జగన్ వినలేదు - సోము వీర్రాజు ఫైర్- ఏపీలో సంక్షోభం -కేంద్రమే దిక్కన్న బీజేపీ నేతలుమోదీ, షా చెప్పినా జగన్ వినలేదు - సోము వీర్రాజు ఫైర్- ఏపీలో సంక్షోభం -కేంద్రమే దిక్కన్న బీజేపీ నేతలు

పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరామని, 2014లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బును షరతులు లేకుండా విడుదల చేయాలని అభ్యర్థించినట్లు బుగ్గన మీడియాకు తెలిపారు. పోలవరాన్ని పూర్తిగా తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం చెప్పిందని, పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానిదే అని చట్టంలో ఉంది అని, చంద్రబాబు వల్ల అంతా చెడిపోయిందని బుగ్గన ఆరోపించారు.

 ap finance minister buggana rajendranath reddy meets with union fm nirmala sitaraman

అయితే, కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టును 2014లో రాష్ట్రం చేపట్టిందని వెల్లడించారు. కేంద్రం పోలవరం నిర్మాణం చేపడితే కాంట్రాక్టులు దక్కవనే ఉద్దేశంతో అప్పటి టీడీపీ సర్కారు నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 2014 నాటి ఖర్చు ఇవ్వాలని గత ప్రభుత్వం తీర్మానం చేసిందని, పోలవరం ఖర్చును పరిమితం చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని మంత్రి బుగ్గన వివరించారు. పోలవరం విషయంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు.

భయంతో 144 రోజులు ఇల్లు కదలని సీఎం నితీశ్ - వలసదారుల్ని గాలికొదిలేశారు- తేజస్వీ నిప్పులుభయంతో 144 రోజులు ఇల్లు కదలని సీఎం నితీశ్ - వలసదారుల్ని గాలికొదిలేశారు- తేజస్వీ నిప్పులు

నాడు చంద్రబాబు ప్రభుతవం పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టు ఏడాదిన్నర ఆలస్యం చేశారు. కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడితే కాంట్రాక్టులు దక్కవని చంద్రబాబు ప్రభుత్వం ఇలా ప్రవర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును సీడబ్ల్యూసీ ద్వారా కన్ఫర్మ్ చేయాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. బాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు . పోలవరం కట్టాలనే ఆలోచన టీడీపీకి లేదు.. కాంట్రాక్టుల కోసమే ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నారు.గత టీడీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టుల కోసం సంవత్సరన్నర కాలం పాటు పోలవరాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. గత టీడీపీ పాలన వల్ల రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది.

 ap finance minister buggana rajendranath reddy meets with union fm nirmala sitaraman

2016వ సంవత్సరంలో 2014 ఖర్చుకు పరిమితం కావాలని ఒప్పుకోవడం సరికాదు. మా ప్రభుత్వంలో పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంచనాలు రివైజ్డ్ చేస్తున్న సమయంలో టీడీపీ ప్రభుత్వ బండారం బయటపడింది.పోలవరం ఇప్పటికీ జాతీయ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎగ్జిక్యూటివ్ అధారిటీ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కండిషన్స్ లేకుండా రీయింబర్స్‌ చేసి త్వరితగతిన విడుదల చేయాలి. భూసేకరణ, పునరావాసం తదితర అంశాలను వేరుగా చూడాలి. ఈ సమస్యకు తగిన మార్గం చూపించాలి. ప్రాజెక్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది' అని బుగ్గన మీడియాకు వివరించారు. జరుగుతోంది' అని బుగ్గన మీడియాకు వెల్లడించారు.

English summary
Andhra Pradesh Finance Minister Bugna Rajendranath Reddy on Friday met Union Finance Minister Nirmala Sitharaman to discuss the state's outstanding funds and arrears. Afterwards, Buggna spoke to the media. says Chandrababu's mistakes in the Polavaram project have done injustice to the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X