Buggana Rajendranath : మంత్రి బుగ్గన మానవత్వం-రోడ్డు పక్కన పడి ఉన్న మహిళకు..
ఏపీలో వైఎస్ జగన్ కేబినెట్ లో సీనియర్ నేత, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ మానవత్వం చాటుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో తాను ప్రయాణిస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఓ మహిళను గుర్తించి ఆయన ఆదుకున్నారు. వెంటనే అధికారుల సాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో బాధితురాలు ఇప్పుడు కోలుకుంటోంది.
కర్నూల్లోని నంద్యాల చెక్ పోస్టు వద్ద ఇవాళ అరుదైన ఘటన చోటు చేసుకుంది. నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఓ మహిళ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో ఆమె ముక్కుకు గాయాలయ్యాయి. లేవలేని పరిస్దితుల్లో ఉంది. అయితే అటుగా వెళ్తున్న వాళ్లెవరూ ఆమెను గమనించలేదు. దీంతో రోడ్డు పక్కన అలాగే పడి ఉంది. ఈ సమయంలో అటుగా కాన్వాయ్ లో వెళ్తున్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆమెను గమనించారు.

ఆర్ధికమంత్రి వెంటనే తన కాన్వాయ్ ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. ముక్కు దగ్గర గాయమై రక్తం కారుతున్న మహిళకు ధైర్యం చెబుతూ అటు వైపు వస్తున్న వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని ఆపి సమీపంలోని ఆస్పత్రికి క్షతగాత్రురాలిని తరలించారు. అనంతరం ఆమెకు అవసరమైన చికిత్సను అందించారు. అలాగే ఆమె చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా తన వ్యక్తిగత సిబ్బందిని బుగ్గన ఆదేశించారు.
కర్నూలు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కలెక్టర్ తో సమీక్ష అనంతరం మంత్రి బుగ్గన నంద్యాలకు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తనతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు అధికారులను మంత్రి బుగ్గన అభినందించారు.












Click it and Unblock the Notifications