బాబుకు స్టాఫ్ 'ఫిట్టింగ్': కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన రాష్ట్ర ఉద్యోగులకు ప్రకటించిన 43 శాతం ఫిట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. తమకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్ కావాలని ఎపి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందులతో అంత ఇవ్వలేమని ప్రభుత్వం అంటోంది.
ఉద్యోగుల పీఆర్సీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది. సోమవారం రాత్రిలోపు పీఆర్సీపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకూ 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని ఏపీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సమస్యలు ఎప్పుడూ ఉండేవనని, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా 2013 నుంచి బకాయిలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నందున అంత ఫిట్‌మెంట్ ప్రకటించలేమని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా పీఆర్సీని 2015 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ విషయమై మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం చంద్రబాబుకు ఫోను చేసి చర్చించనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న సీఎం హైదరాబాద్‌కు తిరిగి రాగానే పీఆర్సీపై నివేదికను అందజేస్తామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది.

ఫాస్ట్‌పై తెలంగాణ ప్రభుత్వానికి అక్షింతలు
ఫాస్ట్ పథకంపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ఫాస్ట్ పథకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫాస్ట్‌పై పునరాలోచిస్తామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో తదుపరి విచారణను 15 రోజులకు వాయిదా వేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ఫాస్ట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకం వివాదాస్పదం కావడంతో దీనిపై పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో సోమవారంనాడు ఫాస్ట్ పథకంపై కోర్టులో విచారణకు వచ్చింది. గతంలో దీనిపై విచారించిన కోర్టు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం ఉందని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఫాస్ట్ పథకాన్ని టీ.సర్కార్ రద్దు చేసినప్పటికీ ఆ విషయాన్ని కోర్టు ఇంకా తెలపకపోవడంతో పాటు అందుకు సంబంధించిన కౌంటర్‌ను సైతం ప్రభుత్వం దాఖలు చేయలేదు. విచారణ సమయంలో ఫాస్ట్ పథకంపై పునరాలోచిస్తున్నామని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినప్పటికి ఎందుకు దాఖలు చేయలేదంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications