ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలెండర్లు తీసుకునే వారికి అలర్ట్..! ఇలా చేయకపోతే కట్..!
ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి మూడు ఫ్రీ గ్యాస్ సిలెండర్లను ప్రభుత్వం ఇస్తోంది. గతేడాది ప్రారంభించిన ఈ పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకం దీపం 2 పథకం లబ్దిదారులకు ఏడాదికి మూడు సిలెండర్లు కొన్ని షరతులతో ఉచితంగా కేటాయిస్తున్నారు. అయితే ఈ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం తాజాగా కీలక సూచన చేస్తోంది. దీన్ని పాటించకపోతే మాత్రం ఇందులో ఓ గ్యాస్ సిలెండర్ కట్ కావడం ఖాయం.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన దీపం-2 పథకం లబ్దిదారులకు ఏడాదికి ఇచ్చేవి మూడు సిలెండర్లు అయినా వాటిని సకాలంలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ తీసుకోని వారు మార్చి చివరి కలల్లా తొలి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్యాస్ బుక్ చేసుకోనివారికి ఇదే చివరి అవకాశమని తెలిపారు.

ఏడాదికి ఇస్తున్న మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లలో భాగంగా ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి సిలెండర్ బుకింగ్ కోసం ఇచ్చిన గడువు మార్చి నెలాఖరుతో ముగియనుంది. కాబట్టి ఈ పథకం లబ్దిదారులు ఇప్పటివరకూ సిలెండర్ బుక్ చేసుకోకపోతే మాత్రం వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. మిగతా లబ్దిదారులు కూడా త్వరలో ఒకటో సిలెండర్ బుక్ చేసుకోవాలని కోరుతున్నారు.
-
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఏపీలో రేపు తీవ్ర వడగాల్పులు-ఈ జిల్లాలకు అలర్ట్..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications