Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Montha: కాకినాడకు సర్కార్ బిగ్ అలర్ట్..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా, ఆ తర్వాత మొంథా తుపానుగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి ఈ తుపాను ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. 28న కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

మొంథా తుఫాను ఈనెల 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపధ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జాల్లా కలెక్టర్లు సహా ఇతర అధికారుల్ని ఆదేశించారు. తుఫాను ముందుస్తు సన్నాహాక చర్యలపై ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామ స్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

AP Government Alerts Officials as Cyclone Montha Approaches Kakinada Coast on oct 28

మొంథా తుఫాను ఈనెల 28వ తేది సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా అని సిఎస్ పేర్కొన్నారు. దాని ప్రభావంతో గంటకు 90 నుండి 100 కి.మీ.ల.వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈనెల 26వ తేది ఆదివారం నుండి తుఫాను ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. అదే సమయంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కావున మత్స్యకారులు ఎవరూ ఈరోజు నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సీఎస్ స్పష్టం చేశారు

తాగునీరు పాలు,కూరగాయలు, కొవ్వొత్తులు వంటి అవసరమైన ఇతర నిత్యావసర వస్తువులను తగిన ప్రదేశాలలో పౌర సరఫరాల శాఖ తగినంత మేర అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంతేగాక అవసరమైతే పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుఫాను షెల్టర్లును సిద్ధంగా ఉండడంతో పాటు వివిధ ప్రాంతాల్లో తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమై ఉండాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. తుఫాను కారణంగా ఎక్కడైనా విద్యుత్ కు అంతరాయం కలిగితే వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలుతమ తీసుకునేలా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

అదే విధంగా తుఫాను ప్రభావంతో రోడ్లపై చెట్లు కూలి రావాణాకు అంతరాయం కలిగితే వెంటనే ఆచెట్ల కొమ్మలను కత్తిరించి చెటల కొమ్మలను తొలగించి రహదారి మార్గాలను పునరుద్ధరించేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వివిధ టెలికాం ఆపరేటర్లతో సమన్వయంతో మొబైల్ టవర్ల వద్ద జనరేటర్ల ఏర్పాటు ద్వారా టెలీకమ్యూనికేషన్ సేవలను సకాలంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటి ఎద్దడి నివారణ, వరదల నియంత్రణ వరద ప్రభావం తగ్గించడానికి చెరువులు, కాలువలు,నదులు వంటి నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని సిఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

AP Government Alerts Officials as Cyclone Montha Approaches Kakinada Coast on oct 28

లంక మరియు పల్లపు ప్రాంత గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆరోగ్య కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు. అదే విధంగా తుఫాను సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు విజ్ణప్తి చేశారు. తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ (IMA) మరియు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(SDMA) నుండి నిరంతరం తాజా హెచ్చరికలు, సమాచారం జారీ చేయబడతాయి కావున క్షేత్ర స్థాయిలోని అధికారులు సిబ్బంది అంతా అత్యంత అ్రమత్తంగా ఉండాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+