Game Changer Ticket Price : గేమ్ ఛేంజర్ కు ఏపీ గుడ్ న్యూస్-టికెట్లకు స్పెషల్ రేట్లు ఇవే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఈ సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు నిరాకరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వడం విశేషం.

ap government allows special ticket price rs 600 for ramcharan s game changer movie benefit show

ఏపీలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం బెనిఫిట్ షోకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర హోంశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు రోజుకు ఐదు షోల చొప్పున వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ మేరకు వీటి టికెట్ రేట్లను కూడా ఖరారు చేసింది.

ap government allows special ticket price rs 600 for ramcharan s game changer movie benefit show

బెనిఫిట్ షో కాకుండా మిగతా రోజుల్లో ఈ టికెట్ రేట్లు వర్తిస్తాయి. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ప్రదర్శించే మల్టిప్లెక్స్ లలో టికెట్ పై అదనంగా రూ.175 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే బెనిఫిట్ షోతో పాటు మిగతా రోజుల్లో టికెట్లకు కూడా జీఎస్టీతో కలిపి ఈ రేట్లను వసూలు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు కానీ, టికెట్ల రేట్ల పెంపుకు కానీ అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేయడంతో డల్ గా ఉన్న టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఊరటనివ్వబోతోంది. తాజాగా తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సంక్రాంతికి వస్తున్న గేమ్ ఛేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నా చిత్రాలను ఆయనే నిర్మించారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రం అయిన గేమ్ ఛేంజర్ కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+