ఏపీ స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పటినుంచో తెలుసా ? వారికి మాత్రం స్పెషల్...

ఏపీలో దసరా సీజన్ వచ్చేస్తోంది. దీంతో పాటే పిల్లలకు సెలవులు కూడా రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్ధులకు సెలవుల్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకూ దసరా సెలవులు ఇస్తున్నారు.

రాష్ట్రంలో క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 1 నుంచి 6 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం విద్యార్ధులకు పరీక్షల సీజన్ నడుస్తోంది. ఇవి పూర్తి కాగానే సెలవులు అమల్లోకి వస్తాయి. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో దసరా సెలవుల గురించి ముందుగానే ప్రకటించింది.ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పని చేస్తాయని , 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. దీని ప్రకారమే ఇప్పుడు దసరాసెలవుల్ని ప్రకటిస్తున్నారు.

ap government announced dussehra holidays to all schools-here are the dates

గత రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యాసంవత్సరంతో పాటు సెలవుల్లోనూ పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. దీన్ని ఈ విద్యాసంవత్సరంలో క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పలు మార్పులు చేశారు. అయితే విద్యార్ధులకు కనీస పనిదినాలు ఉండేలా చూశారు. ఈ మేరకు గతంలో ఖరారుచేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవుల్ని ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+