Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Holidays 2024: ఏపీలో 2024 ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల-వివరాలు ఇవే..!

ఏపీలో వచ్చే ఏడాది అంటే 2024కు సంబంధించిన సాధారణ సెలవుల జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 2318ని విడుదల చేసింది. ఇందులో వచ్చే ఏడాది ప్రభుత్వం ఇచ్చే సాధారణ సెలవులతో పాటు ఐచ్ఛిత సెలవులు(ఆప్ఱనల్ హాలిడే) వివరాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది ఏయే పండుగలకు ప్రభుత్వం ఏయే రోజుల్లో సెలవులు ఇవ్వబోతోందన్నది ఉద్యోగులకు ఈ జాబితాలో తెలుస్తోంది.

ఆదివారాలు, రెండో శనివారాలకు అదనంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే ఇతర సెలవులతో కూడి జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాలు ఇందులో ఉన్నాయి. వీటిని ప్రభుత్వ సంస్ధలు, కార్పోరేషన్లతో పాటు ప్రభుత్వం కింద పని చేసే అన్ని సంస్ధలు, ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ముస్లింల పండుగలైన రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీలకు కూడా ఇందులోనే సెలవులు ప్రకటించినప్పటికీ ఏదైనా మార్పు ఉంటే అప్పుడు మార్చుకునేందుకు వీలు కల్పించింది.

ap government announced general holidays list for 2024-here are dates

తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం సాధారణ సెలవుల్లో జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ సెలవులు ఇచ్చారు. జనవరి 26న ఎప్పటిలాగే రిపబ్లిక్ డే సెలవు ఉంటుంది. మార్చి 8న మహాశివరాత్రి, 25న హోలీ, 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సాధారణ సెలవులు ఇచ్చారు. ఏప్రిల్ 5న బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 9న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామ నవమి సందర్భంగా సెలవులు ప్రకటించారు. జూన్ 17న బక్రీద్, జూలై 17న మొహర్రం, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, 26న కృష్ణాష్టమి సెలవులు ఇచ్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి, 16న మిలాద్ ఉన్ నబీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 11న దుర్గాష్టమి, 31న దీపావళి సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవు ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+