అడవి మనిషిని సలహాదారుగా ఎంచుకున్న చంద్రబాబు..! ఎవరీ అంకారావు ?
ఏపీలో గత ప్రభుత్వంలో సలహాదారులపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన ప్రభుత్వానికి సలహాదారుల్ని ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా అంకారావు అనే వ్యక్తిని సలహాదారుగా ఎంపిక చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్బంగా సన్మానం కోసం పిలిపించిన ఆయన్ను ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్లు అక్కడికక్కడే ప్రకటించి చంద్రబాబు సంచలనం రేపారు. ఇంతకీ ఎవరీ అంకారావు ? సీఎం చంద్రబాబుకు ఆయనలో నచ్చిందేంటి ? అంకారావును సలహాదారుగా నియామకం వెనుక ఉన్న కథేంటో ఓసారి చూద్దాం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న అమరావతిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఏడీసీఎల్ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు కూడా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై పలువురు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారికి సన్మానం కూడా చేశారు. ఇందులో అంకారావు ఒకరు.

నల్లమల అడవుల్ని కాపాడేందుకు శ్రమిస్తున్న వారిలో అంకారావు కూడా ఒకరు. ఆయన పూర్తి పేరు కొమెర అంకారావు. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన అంకారావుది పేద మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ దూరవిద్య ద్వారా పీజీ కూడా పూర్తి చేశారు. రోజూ ఉదయం నల్లమల అడవుల్లోకి వెళ్లడం, చెట్ల కింద పడి ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఏరేయడం, కాలుష్యపు కుంటల్లోకి దిగి ప్లాస్టిక్ చెత్తను తొలగించడం, పక్షులకు గింజలు వేయడం ఆయన దినచర్యలో భాగం.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కె.అంకరావు గారు నియామకం ✅
— Minister of panchayati and rural dovelopment (@PanchayatiandAp) June 10, 2025
అడవుల పెంపకం సలహాదారుగా అంకారావు నియామకం - రెండేళ్లు సలహాదారుగా కొనసాగనున్న అంకారావు గారు.
అంకారావును నియమిస్తూ సీఎస్ విజయానంద్ గారు ఉత్తర్వులు@APDeputyCMO @ncbn pic.twitter.com/lb6VeYgxSc
అంకరావు తనకున్న చిన్న సైజు పొలంలో రాగులు, సజ్జలు పండించి వాటిలో సగం పక్షుల కోసమే వదిలేస్తారు. పక్షుల్లేకుండా అడవి లేదనే భావన అతనిది. పర్యావరణంపై స్థానికంగా ఉన్న స్కూల్లకు వెళ్లి విద్యార్ధులకు అవగాహన కల్పిస్తారు. అడవిలో దొరికే వనమూలికలను సేకరించి అవసరమైన వారికి ఇస్తారు. ప్రకృతి గొప్పదనంపై పలు పుస్తకాలు కూడా రాశారు. విలేజ్ లైఫ్ జర్నీ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. దీంతో ఆయన్ను పర్యావరణ దినోత్సవం రోజు సన్మానించేందుకు పిలిపించిన సీఎం చంద్రబాబు అక్కడికక్కడే తన సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications