జగన్ కు కూటమి సర్కార్ మరో బిగ్ షాక్- ఆ పేరు కనిపించకుండా..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించకుండా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం పలు పథకాలకు పెట్టిన పేర్లను ఇప్పటికే తొలగించింది. వాటి స్ధానంలో కొత్త పేర్లను ఎంపిక చేసి పెట్టింది. ఇదే క్రమంలో తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం సాయంతో నడుస్తున్న ఓ పథకానికి గతంలో జగన్ పెట్టుకున్న పేరును మార్చేసింది.

గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరైన ఇళ్లను పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మించేందుకు వీలుగా జగనన్న కాలనీలుగా పేరు పెట్టింది. పలు చోట్ల ఇదే పేరుతో కాలనీల నిర్మాణాలు కూడా జరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ కాలనీల నిర్మాణం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో జగనన్న కాలనీల పేరును మారుస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ap government changes jagananna colonies name to pmay-ntr nagar

రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరును పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్ గా మారుస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరుతో నిర్మాణం అవుతున్న కాలనీల పేర్లన్నీ పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్ గా మార్చబోతున్నారు.

ఇప్పటికే గతంలో జగన్, వైఎస్సార్ పేరుతో అమలైన పలు పథకాలకు ఎన్టీఆర్ పేరుకు మారుస్తున్నకూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల నిర్మాణ పథకానికి కూడా పేరు మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా ఈ కాలనీలకు కేంద్రం సాయం అందిస్తున్నా సొంత పేర్లతో చేపడుతున్నారన్న అప్రతిష్టకు కూడా ప్రభుత్వం చెక్ పెట్టేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+