AP Sankranti Holidays 2023 : ఏపీలో సంక్రాంతి సెలవుల మార్పు-కొత్త తేదీలివే

ఏపీలో సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సెలవుల్లో మార్పులు కోరుతూ తాజాగా ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ ఏడాది సంక్రాంతి సెలవుల్ని జనవరి 11 నుంచి 16 వరకూ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయించింది. ఈ ఏడాది ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. 17న ముక్కనుమ ఉన్న నేపథ్యంలో సెలవుల్ని ఈ నెల 18 వరకూ పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అకడమిక్ క్యాలెండర్ పై సెలవుల ప్రభావం పడకుండా ఉండేందుకు తాజా మార్పులు చేసింది.

AP government changes time of Sankranti Holidays but not duration- here are new dates..

వీటి ప్రకారం ఏపీలో పాఠశాలలకు, కళాశాలలకు, ఇతర విద్యాసంస్ధలకు జనవరి 12నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇవాళ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సంక్రాంతి సెలవుల్ని మరో రోజు అదనంగా వాడుకునేందుకు ఉపాధ్యాయాలు సిద్ధమయ్యారు. అలాగే విద్యార్ధులు కూడా పండుగను మరో రోజు ఎంజాయ్ చేసేందుకు వీలు కలిగింది. తాజా మార్పుల నేపథ్యంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు తిరిగి జనవరి 19న పునః ప్రారంభమయ్యే పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+