చికెన్ ప్రియులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్-కీలక ప్రకటన..!

ఏపీలో చికెన్ ప్రియుల్ని బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. తాజాగా గోదావరి జిల్లాల్లో బయటపడిన బర్డ్ ఫ్లూ కేసుల కారణంగా చికెన్ తినాలంటేనే జనం భయపడుతున్నారు. అలాగే కోళ్లు, గుడ్ల రవాణా కూడా నిలిచిపోతోంది. అయితే బర్డ్ ఫ్లూ భయాల కారణంగా కోళ్లు, గుడ్ల రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ భయాలతో జనం వీటిని రవాణా చేసే వాహనాల్ని అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కోళ్లు, కోడి గుడ్ల రవాణాపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో కోళ్లు లేదా కోడి గుడ్ల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు ఓ ప్రకటన చేశారు. కొత్తగా రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని ఆయన ప్రకటించారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బర్డ్ ఫ్లూ భయాలతో కోళ్లు, కోడి గుడ్లు తరలించే వాహనాలు అడ్డుకోవద్దని ప్రజలకు సూచించారు.

ap government clarified no new bird flu cases no restrictions on fowls and eggs transport

రాష్ట్రంలో పలు చోట్ల బర్డ్ ఫ్లూ భయాలతో కోళ్లు, కోడి గుడ్ల రవాణాకు ఆటంకాలు కల్పిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ..అలా ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే ఫిర్యాదు చేసేందుకు ఓ కాల్ సెంటర్ నంబర్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు దామోదర్ నాయుడు తెలిపారు. రోడ్డుపై కోళ్ల రవాణా వాహనాల్ని అడ్డుకుంటే 0866-2472543 లేదా 9491168699 నంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. అసత్య ప్రచారాల వల్ల కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారని, కాబట్టి ఈ పరిశ్రమను ప్రోత్సహించేందుకు త్వరలో ఎగ్ మేళాలు, చికెన్ మేళాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+