Dussehra: ఏపీలో దసరా సెలవు మార్పు-సర్కార్ ఉత్తర్వులు..
ఏపీలో స్కూళ్లకు ప్రభుత్వం ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా గతంలో ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం సెలవు ఇచ్చింది. అయితే అందులో మార్పు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24న దసరా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించగా.. ఇప్పుడు విజయదశమి సెలవుగా దాన్ని గుర్తిస్తూ నోటిఫికేష్ జారీ చేసింది.
గతేడాది డిసెంబర్ 15న విడుదల చేసిన ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24న దసరా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. దీని ప్రకారం అక్టోబర్ 23న దసరా సెలవు ఇచ్చారు. దీన్ని ఇప్పుడు అక్టోబర్ 24కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. దీంతో అక్టోబర్ 24న ఐచ్చిక సెలవుకు బదులుగా సాధారణ సెలవు దినంగా పరిగణించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపారు.

దసరా సెలవు (విజయదశమి)ను అక్టోబర్ 24కు మారుస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఇవాళ జీవో నంబర్ 2047 విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ లోనూ మార్పులు చేసినట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకూ ఈ సెలవు వర్తిస్తుంది. అలాగే వ్యాపార సంస్ధలు కూడా నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం అదే రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications