ఏపీలో ఆ ఉద్యోగుల బదిలీల గడువు సెప్టెంబర్ 15 వరకూ పొడిగింపు..!
ఏపీలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తాజాగా సడలించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 31 వరకూ ప్రభుత్వంలోని 15 శాఖల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎక్సైజ్ శాఖకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకూ బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఉన్న ఉద్యోగుల బదిలీల గడువును వచ్చే నెల 15 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఉద్యోగుల బదిలీల గడువు కూడా ఆగస్టు 31తో ముగియనుంది. దీంతో వీరి బదిలీలపై నిషేధం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీన్ని ఇప్పుడు మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రేపటి తో ఉద్యోగుల బదిలీల గడువు ముగుస్తోది. అయితే ఇంకా కొన్ని కీలక శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం ఇప్పటివరకూ మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు జరగలేదు. వీటిలో కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు లేనట్లేనన్న వాదన వినిపిస్తోంది. అలాగే రవాణా శాఖలో ఆరోపణల నేపథ్యంలో బదిలీల మార్గదర్శకాల విడుదలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఇవి మినహా మిగిలిన శాఖల్లో బదిలీల ప్రక్రియ రేపటితో ముగియనుంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications