ఏపీలో రేపటి నుంచే పెన్షన్లు ! కొందరికే ఇంటికి-మిగతా వాళ్లకు అక్కడే..!
ఏపీలో ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారిని దూరంగా ఉంచాలని నిర్ణయించిన ఈసీ.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని అంతా ఒకేలా కాకుండా వివిధ రకాలుగా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వం రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి వీలుగా సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
పెన్షన్ల పంపిణీపై సవరించిన విధివిధానాలను ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. దీని ప్రకారం రేపు మధ్యాహ్నం నుంచి ఈనెల 6 లోగా పెన్షన్ల పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే కేటగిరీల వారీగా పెన్షన్ల పంపిణీకి విధివిధానాలు ఇచ్చారు. అంటే కొంతమందికి ఇంటివద్ద పెన్షన్ నగదు పంపిణీ, మిగిలిన వారికి గ్రామ,వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
దివ్యాంగులు,తీవ్ర అనారోగ్యం తో బాధపడేవారు,అస్వస్థతకు గురైనవారు,మంచానపడ్డవారు,వృద్ద వితంతువులకు ఇంటివద్ద పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. 2లక్షల 66 వేల 158 మంది వాలంటీర్లు ఉంటే లక్షా 27వేల 177 మంది మాత్రమే సచివాలయ సిబ్బంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే సచివాలయ సిబ్బందిలో కొంతమందికి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల విధులు అప్పగించింది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీ సమయంలో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వులో వెల్లడించారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?










Click it and Unblock the Notifications