కొత్త పెన్షన్ల ఖరారు పై ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారిని తొలగించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు సచివాలయాలకు బాధ్యత అప్పగించింది. వచనలలోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేసి కొత్త పెన్షన్లు విడుదల చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఏపీలో ప్రస్తుతం 67 లక్షల మందికి అనేక రకాలుగా పెన్షన్లు అందుతున్నాయి. కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచింది. ప్రతినెల 1వ తేదీన వీటిని పంపిణీ చేస్తుంది. గతంలో వాలంటీర్లు పంపిణీ చేయగా, ప్రస్తుతం వార్డు.. గ్రామ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయిస్తున్నారు. గత ఏడాది కాలంగా అర్హత ఉండి పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP government latest guidelines power removal of fake pensions across the state

అర్హత ఉన్న అందరికీ పెన్షన్లు అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను మొదలు పెడతామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్ అందుకుంటున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. పెన్షన్ల తనిఖీ కోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేసింది. ఈ యాప్ లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పూర్తి సమాచారం సచివాలయ సిబ్బంది అందించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అర్హుల తుది జాబితాను ప్రభుత్వం ఖరారు చేస్తుంది.

పెన్షన్ లబ్ధిదారుల జాబితాలను సంబంధిత గ్రామసభల్లోనూ ప్రకటిస్తారు. సంబంధిత సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే గ్రామసభలు నిర్వహించినప్పుడు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకొని అవకాశం కల్పించనున్నారు. అనరుల పెన్షన్ తొలగించే ముందు వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతనే అనరులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో అర్హుల జాబితాను ఖరారు చేయటం పైన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+