Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్.. ఏపీలో స్లాట్ బుకింగ్స్ చేసుకోండిలా..!

ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు వెళ్లి పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే స్లాట్ బుక్ చేసుకుని వెళ్లే సదుపాయాన్ని ఇవాళ ప్రారంభించింది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రిజిస్ట్రేషన్ దారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ర్టేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్లాట్ బుకింగ్ అవగాహన కరప్రతాన్ని, పోస్టర్ ను మంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలనే సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

ap government launches online slot booking facility for registrations- here is how to book

రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి
రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్ష్యులు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు తమకు కుదిరిన సమయాల్లో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చన్నారు.

స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్లు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయన్నారు. ఈ రోజున మొత్తం 26 జిల్లా ప్రధాన కార్యాలయాల రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, మొత్తం 296 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే గాంధీనగర్, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామని, ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా అన్లైన్ లో డేటా ఎంట్రీ చేసి డాక్యుమెంట్ ప్రీపేర్ చేసుకొని ఫీజు కూడా కట్టేసి ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చిన 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుందన్నారు.

ఒక వేళ స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయిన వారు సబ్ రిజిస్టార్ ఆఫీసుకు వస్తే సాయంత్రం ఐదు గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా రూ.ఐదు వేల రూపాయల ప్రత్యేక ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఉగాది,రంజాన్ పండుగల సందర్భంగా వరుసగా వచ్చిన మూడు రోజుల సెలవుల్లో దాదాపు రూ.74 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఆదాయం లభించిందన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఆటోమ్యూటేషన్ను సులభతరం చేయడం కోసం రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ ను రెవెన్యూ డేటాబేస్ తో అనుసంధానం చేశామన్నారు.

ap government launches online slot booking facility for registrations- here is how to book

మున్సిపల్ శాఖ, డీటీసీపీతోనూ అనుసంధానం అనుసంధానం ప్రారంభించామని, ఈ ప్రక్రియ 2025 ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ఈ అనుసంధానంతో ఆస్తిపై యాజమాన్యం ఉన్న వ్యక్తి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలుగుతారని చెప్పారు. డబుల్ రిజిస్ట్రేషన్, నకిలీ డాక్యుమెంట్ల సృష్టి లాంటి రియల్ ఎస్టేట్ మోసాలను నివారించేందుకు శాఖ అనేక చర్యలు తీసుకుందన్నారు. ఆధార్ సేవల్ని రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

డాక్యుమెంట్లను సమర్పించినప్పుడు పార్టీల డిజిటల్ సంతకాలు కూడా తీసుకుంటామని,ఇలా ఆధార్ తో గుర్తింపు ప్రారంభించిన తొలి రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ నుండి ప్రశంసలు అందుకున్నామని చెప్పారు. రెవెన్యూ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఆర్ పి సిసోదియా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల శాఖలో వరుసగా తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా అవినీతి తగ్గిపోయి పారదర్శకత పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఫేస్ లెస్, పేపర్ లెస్, క్యాష్ లెస్ గా రిజిస్ట్రేషన్లు జరపాలనేది తమ లక్ష్యమని చెప్పారు.

స్లాట్ బుకింగ్ విధానం ఇలా:

రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ registration.ap.gov.in లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా డేటా అంతా ఎంట్రీ చేసి అప్లికేషన్ నెంబర్ ను పొందాలి. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ మాడ్యూల్ లో అప్లికేషన్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరోజు నుండి 15 రోజుల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ 15 రోజుల్లో ఖాళీగా ఉన్న స్లాట్ ను డైనమిక్ గా వైబ్ సైట్ ఎప్పుడూ చూపిస్తూ ఉంటుంది.

ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్లాల్సిందేనా..?

అక్కర్లేదు. ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్కింగ్స్ చేసుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+