ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచో తెలుసా ?

ఏపీలో విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఇవ్వబోతోందనే అంశంపై విద్యార్ధులు, తల్లితండ్రులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వడగాల్పులు పెరుగుతున్న నేపథ్యంలో వేసవి సెలవుల కోసం డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.

ఏపీలో ఈ ఏడాది వేసవి సెలవుల్ని ఈ నెల 30 నుంచి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకటి నుంచి పదో తరగతి విద్యార్దులకు ఈ నెల 27తో అన్ని పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ఫలితాల ప్రకటన, పేరెంట్, టీచర్స్ మీటింగ్స్ వంటివి నిర్వహించే అవకాశముంది. అనంతరం వాతావరణ పరిస్దితుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు నుంచి సెలవులు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా నెలాఖరు కల్లా సెలవులు ప్రకటిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

apschools

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు వేసవి సెలవులు వెంటనే ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పరీక్షలు పూర్తి చేసి వేసవి సెలవులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాతావరణ పరిస్దితులు ఇలాగే ఉంటే ఈ నెల 30 నుంచి సెలవులు ప్రకటించేలా, వచ్చే విద్యాసంవత్సరాన్ని తిరిగి జూన్ 12న మొదలు పెట్టేలా అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే మాత్రం ఇంకా ముందే వేసవి సెలవులు ప్రకటించే అవకాశాలూ లేకపోలేదు.త్వరలో దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+